బోరు బావి నుంచి నీరు రావడం తెలుసు. పెట్రోల్ కూడా వస్తుందని తెలుసు, కానీ బంగారం వస్తే…! ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది. పంట పండించేందుకు నీటి కోసం బోరు వేసిన ఓ రైతుకు అందులోంచి బురదతో పాటు బంగారు వర్ణంలో ఉన్న పొడి వెలువడింది. బోలంగీర్ జిల్లా ఖాప్రాఖోల్ బ్లాక్ పరిధి చంచన బహాలి పంచాయతీ నందుపాలలో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన జావెద్ అనే రేతు మార్చి 8న తన పొలంలో బోరు తవ్వించాడు. శుక్రవారం నాడు ఆ బోరు బావి నుంచి బురదతో పాటు బంగారు వర్ణంలో ఉన్న పొడి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. పసుపు వర్ణంలో ఆ పొడి ధగ ధగా మెరుస్తుండటంతో అది బంగారమేనని గ్రామంలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ నోటా ఈ నోటా ఈ విషయం అధికారులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. బోరును సీజ్ చేసి, మట్టి నమూనాలు సేకరించారు. పరీక్షలు జరిగాక అది బంగారమా లేక ఏదైనా ఇతర ఖనిజమా అన్నది పరీక్షల తర్వాత నిర్ధారణ అవుతుందని తహశీల్దార్ ఆదిత్య మిశ్రా అన్నారు. అయితే ఇది బంగారమేనని గ్రామస్థులు సంబరపడిపోతున్నారు. అదే నిజమైతో తమ ఊరి దశ తిరుగుతుందని సంబరపడుతున్నారు.
గతంలో గంధమర్దన పర్వత ప్రాంతాల్లో వివిధ లోహాల నిల్వలు ఉన్నాయని ప్రచారం జరిగింది. మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైతం దియోగఢ్, కెంఝోర్, మయూర్‌బంజ్ ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిపింది. కానీ బొలంగీర్ జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. సర్వే ప్రకారం గ్రాఫైట్, మాంగనీస్ నిల్వలు మాత్రం ఉన్నాయి. ల్యాబ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చేదాకా అది బంగారమో కాదో తెలియదు మరి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!