• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్ క్లినిక్’ మెషిన్

    దేశంలోనే మొదటి సారిగా ‘ఎనీ టైమ్ క్లినిక్’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మెషిన్‌ ద్వారా జ్వరం నుంచి కేన్సర్ వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు స్వయంగా మనమే చేసుకోవచ్చు. దీన్ని తొలిసారిగా చందానగర్‌లోని ప్రణామ్ ఆస్పత్రిలో ప్రారంభించారు. నార్మల్ హెల్త్ చెకప్, జ్వరం, కంటి పరీక్షలు వంటి 75 రకాల టెస్టులు చేసుకునేందుకు ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. మెషిన్‌కు అమర్చిన కెమెరా ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం సైతం ఉంది.

    నేను బాగానే ఉన్నాను: అదా శర్మ

    ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ‘కేరళ స్టోరీ’ నటి అదా శర్మ తెలిపింది. తన హెల్త్ కండీషన్‌పై అదా శర్మ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘కొద్ది రోజులుగా చర్మసంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. మొహమంతా దుద్దుర్లు వచ్చాయి. మందులు వాడటంతో అవి అలర్జీకి దారి తీశాయి. దీంతో వేరే మందులు వాడుతున్నా. కొన్ని రోజులపాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని అనుకుంటున్నా. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా.’’ అంటూ ఆదా శర్మ రాసుకొచ్చింది.

    మహిళలూ… ఫిట్‌నెస్ మెరుగుపరచుకోండిలా

    మహిళలకు వారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకునేంత తీరిక, ఖాళీ ఉండదు. అది ఉద్యోగానికి వెళ్లే వారైనా.. ఇంట్లోనే ఉండి పనిచేసే వారికైనా ఒకటే. అయితే మహిళలకు తమ ఆరోగ్యం పట్ల, ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో చివరి బుధవారాన్ని జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్ దినోత్సవంగా ప్రకటించారు. ఇక రోజూ మహిళలు ఫిట్‌గా ఉండేందుకు పాటించవలసిన 6 సులువైన పద్ధతులను గురించి తెలుసుకుందాం… ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి ప్రతిరోజు ఉదయం మనం టిఫిన్‌గా ఏమి తీసుకుంటామో… అదే మన … Read more