• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాజాలో ఆసుపత్రిపై మరో దాడి

    గాజాపై ఇజ్రాయెల్‌ మరో భారీ దాడికి పాల్పడింది. తాజాగా ఆసుపత్రిపై దాడి ఘటనలో భారీ సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్సు వాహనశ్రేణి ద్వంసమయ్యాయి. అంబులెన్సుల బయట చాలా మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. చనిపోయిన వారిలో చిన్నారులు ఉన్నారు. మానవతా సాయం అందించేందుకు వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని అమెరికా చేసిన అభ్యర్థనను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది.

    ఒకే కుటుంబంలో 19 మంది మృతి

    ఇజ్రాయెల్ దాడిలో ఓ జర్నలిస్టు 19 మంది కుటుంబసభ్యులను కోల్పోయాడు. హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే గాజా శివార్లలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్‌మెంటుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ చెందిన ఓ జర్నలిస్టు కుటుంబంలో 19 మంది శరణార్థ శిబిరంలో ప్రాణాలు కోల్పోయారు.

    హమాస్‌ చెరలో 210 మంది బందీలు

    గాజాలోని హమాస్‌ చెరలో తమ దేశ పౌరులు చాలా మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్‌ తెలిపింది. మిలిటెంట్ల వద్ద 210 మంది బందీలుగా ఉండవచ్చన అభిప్రాయపడింది. అయితే ఇదే తుది సంఖ్య కాదని బందీల సంఖ్య మరింత పెరగొచ్చని పేర్కొంది. హమాస్ చెరలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారని చెప్పింది. అయితే హమాస్‌ నిన్న ఇద్దరు అమెరికన్‌-ఇజ్రాయెల్‌ మహిళలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

    బందీలు ప్రాణాలతోనే ఉన్నారు: ఇజ్రాయెల్

    హమాస్ మిలిటెంట్ల వద్ద బాందీలుగా ఉన్న చాలా మంది ప్రాణాలతోనే ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. దాదాపు 200 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నారని పేర్కొంది. వారిలో ఎక్కువ శాతం సజీవంగా ఉన్నారని వెల్లడించింది. బందీల్లో 20 మంది చిన్నారులు, మరో 10-20 మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఉన్నట్లు తెలిపింది. హమాస్‌ల చెర నుంచి వారిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది.

    ఆసుపత్రిపై దాడి: మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

    గాజాలో ఆసుపత్రి దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్ అహ్లీ ఆసుపత్రిలో ప్రాణనష్టంపై బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆసుపత్రిపై దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    ఇజ్రాయెల్ పర్యటనకు బైడెన్

    రేపు ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా వైట్‌హౌస్ ప్రకటించింది. అనంతరం ఆయన జోర్డాన్‌కూ వెళ్లనున్నట్లు తెలిపింది. అక్కడ ఈజిప్ట్‌, పాలస్తీనా, జోర్డాన్‌ దేశాధినేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొంది. తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ మద్దతు ఇవ్వడమే బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని శ్వేతసౌధం పేర్కొంది. అలాగే గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించీ చర్చిస్తారని పేర్కొంది.

    ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలు

    గాజాలో పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. . ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి మృతదేహాలను భద్రపర్చేందుకు చోటు సరిపోవడం లేదు. దీంతో ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గజాలో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 2,600 మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాల్చేందుకు శ్మశానవాటికల్లోనూ స్థలం సరిపోకపోవడం లేదు.

    పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు

    ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.. అక్కడ్నుంచి కొంతమంది పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆ బందీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉగ్రవాదులు బందీల పిల్లలను ఆడిస్తూ, కన్పించారు. ఓ మిలిటెంట్‌ ఒక చేతిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని చంటిబిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నాడు. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్ని ఇచ్చేందుకే మిలిటెంట్లు ఈ వీడియోను విడుదల చేశారని అభిప్రాయాలు వస్తున్నాయి.

    మధ్యవర్తిత్వానికి సిద్ధమే: పుతిన్

    ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు, మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. పౌరులపై ఆయుధాలను ఉపయోగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. అమాయకుల మరణాలు ఆమోదయోగ్యం కాదని పుతిన్ వ్యాఖ్యానించారు.

    13 మంది బందీలు మృతి: హమాస్

    ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు ఆ దేశ పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. వారిని విడిపించుకునే క్రమంలో ఇజ్రాయెల్ గాజాలో నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలను నిలిపేసింది. గాజాపై బీకర దాడులు చేస్తుంది. అయితే ఈ దాడుల్లో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు 13 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టింది.