• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అప్పటి వరకు గాజాలో అన్ని బంద్’

    హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ పలు హెచ్చరికలు చేసింది. బందీలుగా ఉన్న తమ పౌరులను సురక్షితంగా విడిచిపెట్టాలని కోరింది. అప్పుడే గాజాకు నీరు, విద్యుత్, ఇందన సరఫరాలు పునరుద్ధరిస్తామని చెప్పింది. అప్పటి వరకు గాజాపై తమ నిబంధనలు కొనసాగుతాయని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నవారు క్షేమంగా ఇళ్లకు పంపాలని చెప్పింది. లేకుంటే తీవ్ర మరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాదులు దాడి చేసిన రెండో రోజు నుంచే గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్భందనం చేసిన విషయం తెలిసిందే..

    అంధకారంలోకి ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్‌లో గాజాపై హమాస్ ఉగ్రవాదుల భీకర దాడులను కొనసాగుతున్నాయి. హమాస్‌ విలిటెంట్లు కేంద్రంగా చేసుకున్న అనేక స్థావరాలపై ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌.. విద్యుత్తు, ఆహారం, ఔషధాలతోపాటు ఇంధన సరఫరాను నిలిపేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులన్నింటినీ మూసివేయడంతో.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం అసాధ్యంగా మారింది.

    చనిపోయినట్లు నటించినా గుర్తించి చంపేశారు

    ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదులు నరమేధం కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ మహిళ చనిపోయినట్లు నటించింది. అయినా ఆమె శ్వాసను గుర్తించి మరీ ఉగ్రవాదులు ప్రాణం తీశారు. మాపల్‌ ఆడమ్‌ (27) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో ఆమె ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించింది. అయితే ఆమె శ్వాస తీసుకోవడాన్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆమెను హతమార్చారు.

    కుటుంబాన్ని తప్పించి.. తూటాలకు బలై..

    ఇజ్రాయెల్‌‌లో అమాయక ప్రజలను హమాస్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో మన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. ఉగ్రవాదుల బారి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుని తను మాత్రం హమాస్‌ల తూటాలకు బలయ్యాడు. ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డాన్ని గమనించి ఆ వ్యక్తి వెంటనే ఇంటి కిటికీ నుంచి కుటుంబసభ్యులను తప్పించాడు. ఈ క్రమంలో తాను తప్పించుకుంటుండగా అప్పటికే ముష్కరులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కిటికీ వద్దే ప్రాణాలు కోల్పోయాడు. GRAPHIC: A heartbreaking video of a father … Read more

    యద్ధం ఎఫెక్ట్: పెరిగిన చమురు ధరలు

    ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర నాలుగు శాతానికి పైగా పెరిగి 87.5 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఎస్‌ రకం ధర 85.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చమురు సరఫరాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇజ్రాయెల్‌‌కు అండగా ఉంటాం: మోదీ

    ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ పౌరుల మృతిపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి లోనయ్యా ఈ విపత్కర పరిస్థితిల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతాం, అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో మిలిటెంట్ల హింసాత్మక దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.