• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సుష్మ స్వరాజ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

  అమెరికా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్‌ను మంచి రాజకీయ వేత్తగా చూడలేదన్నారు. ఆమెను యూఎస్‌లో ఉపయోగించే అవమానకరమైన గూఫ్‌ బాల్, హార్ట్‌ ల్యాండ్ పొలిటికల్ హ్యాక్ అన్నారు. జైశంకర్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేసిన మైక్‌..ఇంతకంటే సమానహోదా కలిగిన వ్యక్తి ఉండడు. నాకంటే కూడా గొప్ప వ్యక్తి “ అన్నాడు. ఇటీవల రాసిన తన నెవర్ గివ్ ఆన్ ఇంచ్ పుస్తకంలో వీరిగురించి ప్రస్తావించాడు.

  శ్రీలంక రుణాలకు భారత్ పూచికత్తు

  ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. IMF వద్ద శ్రీలంక తీసుకునే రుణాలకు భారత్ పూచికత్తు హామీని అందిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఈమేరకు వెల్లడించారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘేతో ఆయన సమావేశమయ్యారు. శ్రీలంకలో తమిళుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమిళులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకుంటామని విక్రమ్ సింఘే హామీ ఇచ్చారు.

  అంకురాలకు అడ్డాగా భారత్: జైశంకర్

  అంకుర వ్యవస్థలకు అడ్డాగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భారత్ అవతరిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. మధ్య ఆసియా దేశమైన సిప్రస్‌ పర్యటనలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా సమయంలో మిగతా దేశాలు ఒకరకంగా ఆలోచిస్తే.. భారత్ మాత్రం సంస్కరణలపై దృష్టి సారించిందని గతేడాది జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో మోదీ చెప్పారు. ఫలితంగానే ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. గతేడాది 81బిలియన్ డాలర్లు వచ్చాయి. దాదాపు 100బడా కంపెనీలకు కేంద్రంగా భారత్ … Read more

  వారు ఉన్నతంగా ఆలోచించలేరు: జైశంకర్

  ప్రధాని నరేంద్రమోదీని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి విమర్శించడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. పాకిస్థాన్ ఎన్నడూ ఉన్నతంగా ఆలోచిస్తుందని అనుకోలేదని స్పష్టం చేశారు. ‘పాక్ వ్యాఖ్యలను ఖండిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ ఇదివరకే ప్రకటన చేసింది. పాక్ ఎన్నడూ ఉన్నతంగా ఆలోచిస్తుందని అనుకోలేదు. వారు హుందాగా వ్యవహరించలేరు’ అని జైశంకర్ వెల్లడించారు. నరేంద్రమోదీని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంటూ పాక్ మంత్రి భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  పాక్‌ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే జవాబిచ్చిన జై శంకర్‌

  న్యూయార్క్‌లోని యూఎన్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మీడియా సమావేశంలో… తీవ్రవాదంపై పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ అడిగిన ఓ ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి దిమ్మదిరిగే సమాధానమిచ్చారు. ‘ఇంకెంత కాలం దిల్లీ, కాబూల్‌, పాకిస్థాన్‌ నుంచి దక్షిణ ఆసియా తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. ఇంకెంత కాలం యుద్ధపు అంచున నిలబడాలి?’ అని పాక్‌ రిపోర్టర్‌ ప్రశ్నించారు. ‘ ఈ ప్రశ్న నన్ను కాదు. పాక్‌ ఎంతకాలం ఉగ్రవాదాన్ని ఆచరించాలనుకుంటుందో మీ మంత్రిని అడిగితే చెబుతారు’ అంటూ జై శంకర్‌ సమాధానమిచ్చారు.

  లాడెన్ కు ఆశ్రయమిచ్చిన మీరా చెప్పేది?

  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్ కు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా స్పందించారు. బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి ఆశ్రయమిచ్చి, పొరుగుదేశం పార్లమెంటుపై దాడికి పాల్పడిన దేశానికి యూన్ఓలో మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని చైనా, పాక్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గతమన్నారు.

  ఆసియాకప్‌ వివాదంపై జైశంకర్

  ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి ఉండాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ ముఖ్యకార్యదర్శి జైశంకర్‌ అన్నారు. ఆ ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌, ఇండియా మధ్య చర్చలనే అంశం క్లిష్టమైనదని వ్యాఖ్యానించారు. నుదుటి మీద తుపాకి పెడితే ఎవరైనా మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఆసియా కప్‌ వివాదం స్పందించిన ఆయన టోర్నమెంట్లు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయమెంటో మీకు తెలుసని అన్నారు.

  యూఎన్ఓలో గాంధీ విగ్రహం

  న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్‌లో జరిగే భద్రతా సమావేశంలో భారత్ నుంచి బాపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రతిష్టించనున్న తొలి విగ్రహం గాంధీదే కావడం విశేషం. వచ్చేనెల 14న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ విగ్రహ తయారీదారుడు రామ్ సుతార్ తయారు చేశారు.

  డ్రోన్ల వ్యవస్థతో ముప్పు: జైశంకర్‌

  ఉగ్రవాదంతో ముప్పు క్రమంగా పెరుగుతోందని విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్‌ అన్నారు. ఉగ్రవాదులు, నేరస్థులు మానవరహిత వైమానిక వ్యవస్థను ఉపయోగించడం ప్రభుత్వాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందన్నారు. దిల్లీలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ వైమానిక వ్యవస్థ తక్కువ ఖర్చు, సులభతరం కావటంతో ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా చేసి దాడులకు పాల్పుడుతున్నారని పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు.

  ‘మా విద్యార్థులకు వీసా ఇవ్వండి’

  భారత విద్యార్థుల వీసాలను పునరుద్ధరించాలని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కోరారు. గురువారం ఆక్లాండ్‌లో న్యూజిలాండ్ విదేశాంగశాఖ మంత్రి ననైయా మహుతాతో సమావేశమయ్యారు. కోవిడ్ సమయంలో భారత్ వచ్చినవారిని తిరిగి ఇక్కడికి రానివ్వలేదని, వారి సమస్యను తీర్చాలని సూచించారు. కాగా ఇండో పసిఫిక్ రీజియన్‌లో భద్రత, ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.