• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాటరీలో రూ.14.699 కోట్లు జాక్‌పాట్

    అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి జాక్‌‌పాట్ తగిలింది. పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీలో అతడు ఏకంగా 1.765 బిలియన్ డాలర్లు (రూ.14.699 కోట్లు) ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. అయితే ఈ టికెట్ కొన్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

    కేర్‌టేకర్‌కు 690 ఏళ్లు జైలు శిక్ష

    చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో ఓ వ్యక్తికి 690 ఏళ్లు జైలు శిక్ష పడింది. నిందితుడు బేబీ కేర్‌టేకర్‌గా పనిచేస్తూ చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. వారిని శారీరక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటపడటంతో అతడికి న్యాయస్థానం 690 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో జరిగింది. మథ్యూ జక్ర్‌జేవ్‌స్కీ (34) బాలుర కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎంతో మంది చిన్నారులను వేధించాడు.

    ‘ట్విటర్‌ పేరు మార్పు నా చావుకొచ్చింది’

    ట్విట్టర్ పేరు మార్పు తన చావుకొచ్చిందంటూ ఓ యూజర్ ఆవేదన వెళ్లగక్కాడు. కాలిఫోర్నియాలో ట్విట్టర్ హెడ్ క్యార్టర్స్ ఎదురుగా క్రిస్టోఫర్ నివాసముంటున్నాడు. క్వార్టర్స్‌పై అమర్చిన X గుర్తు రేడియంట్ లైట్ వెలుగుతూ తన ఇంటిపై పడుతుండటంతో నిద్రపట్టడంలేదని క్రిస్టోఫర్ చెప్పుకొచ్చాడు. తన బెడ్‌రూమ్‌పై పడుతున్న X గుర్తు వెలుతురును పోస్ట్ చేస్తూ ఇది నా పరిస్థితి అంటూ ఆవేదనను వెళ్లగక్కాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. Imagine no more. This is my life now. https://t.co/k5QfAm8yuG pic.twitter.com/e7ECCM2NUD — … Read more