• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

  ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

  ఈ ఏడాది ప్రభాస్‌కు కలిసిరాలేదు

  బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌కి ఈ ఏడాది కలిసి రాలేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రభాస్‌కు ఇదొక చేదు సంవత్సరంగా చెప్పొకోవచ్చు. ఈ ఏడాది ఎన్నో అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఆదిపురుష్‌తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చని అనుకుంటే.. ఆ సినిమా ట్రైలర్ మరింత నిరుత్సాహ పరిచింది. దీంతో సినిమా ఏకంగా ఏడు నెలలకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ గాడ్‌ఫాదర్‌లా భావించే కృష్ణంరాజు మరణం ప్రభాస్‌ని మరింత కుంగదీసింది. ఇలా ఏ ఒక్క … Read more

  కృష్ణంరాజు కుటుంబానికి బాలయ్య పరామర్శ

  బాలకృష్ణ దంపతులు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. భార్య వసుంధరా దేవితో కలిసి కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బాలయ్య.. ముందుగా కృష్ణంరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని ఓదార్చారు. ఆమెకు ధైర్యం చెప్పారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా బాలయ్య గుర్తుచేసుకున్నారు.

  కృష్ణం రాజు పేరిట స్మృతివనం

  దిగ్గజ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్మృతి వనం నిర్మించనుంది. మొగల్తూరు సమీప సముద్రతీరంలో రెండెకరాల స్థలం కేటాయించి స్మృతి వనం నిర్మిస్తామని ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రకటించారు. నిన్న జరిగిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్యామలాదేవిని, ప్రభాస్‌ను పరామర్శించారు.

  కృష్ణంరాజు సంతాప సభలో అదిరిన వంటకాలు

  ఏపీ మొగల్తూరులో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంతాప సభలో అదిరిపోయే భోజనం పెట్టారు. చికెన్, మటన్, రొయ్యలు, బిర్యానీ రైస్, స్వీట్స్ సహా పలు రకాల వంటలను వచ్చిన అతిథులకు వడ్డీంచారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్ వచ్చి దగ్గరుండి మరి ఏర్పాట్లు చూసుకున్నారు. తన చేతితో వడ్డించారు. అందరూ తిని వెళ్లాలని అభిమానులను కోరారు. దీంతో ఈ కార్యక్రమానికి అభిమానులతోపాటు అనేకమంది తరలివచ్చారు. దాదాపు లక్ష మంది కోసం రూ.3 కోట్లతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. Screengrab Twitter: Screengrab Twitter: … Read more

  ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు

  రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, డార్లింగ్ ప్రభాస్‌ల ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇద్దరి మేనరిజాలు పోలుస్తూ ఓ నెటిజన్ ఎడిట్ వీడియో రూపొందించాడు. ఈ వీడియోలో ఇద్దరూ వారి వారి సినిమాల్లో ఒకే రకంగా నవరసాలు పండిస్తూ నటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రెబెల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas)

  12ఏళ్ల తరువాత సొంతూరుకి ప్రభాస్

  దాదాపు 12ఏళ్ల తరువాత ప్రభాస్ తన సొంతూరైన భీమవరంలోని మొగల్తూరుకు వెళ్లనున్నారు. కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు అక్కడే జరపనున్నందున ప్రభాస్ భీమవరంలో అడుగు పెట్టనున్నారు. దీంతో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం. పెద్దనాన్న మరణంతో ప్రభాస్ మానసికంగా కాస్త బలహీనమయ్యారు. దీంతో సినిమాలకు బ్రేక్ చెప్పేశారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక తను తిరిగి సెట్స్‌కి వెళ్లనున్నాడు.

  కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి

  వేలాది అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య వెండితెర రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. కనకమామిడి ఫాం హౌజ్‌లో అధికారిక లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి పోలీసులు ఆయనకు గన్ సెల్యూట్ చేశారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అనుమతి ఉన్నవారినే అంత్యక్రియలకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

  కన్నీళ్లు పెట్టుకున్న జయప్రద !

  నిన్న మృతి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజుకు సీనియర్ నటి జయప్రద నివాళులు అర్పించారు. కృష్ణంరాజు నివాసంలో ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో సినిమాల్లో కృష్ణంరాజుతో కలిసి నటించిన ఆమె.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు కనకమామిడి ఫామ్ హౌజ్‌లో జరగనున్నాయి. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

  దేశంలో పెరుగుతున్న బ్యాక్టీరియాలు

  భారత్‌లో యాంటీ బయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇటీవల ICMR నిర్వహించిన పరిశోధనల నివేదికలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. సుదీర్ఘకాలం ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారికి నెగెటివ్ బ్యాక్టీరియాలు సోకుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. తాజాగా సినీనటుడు కృష్ణంరాజు మృతికి కారణం పేర్కొంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో కూడా మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా గురించి వైద్యులు ప్రస్తావించారు. ‘ఎసినెటో బాక్టర్‌ బౌమన్ని’ అనే బ్యాక్టీరియా రక్తం, యూరినరి ట్రాక్ట్‌, ఊపిరితిత్తులు ఇతర అవయవాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స … Read more