ఐమ్యాక్స్లలో ‘పొన్నియన్ సెల్వన్2’
‘పొన్నియన్ సెల్వన్2’ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే, ఐమ్యాక్స్ థియేటర్లలోనూ ఈ మూవీని వీక్షించొచ్చని చిత్రబృందం ప్రకటించింది. కల్కి నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. చాలా గ్రాండియర్‌గా, అత్యున్నతంగా చోళ రాజ్యాన్ని తీర్చిదిద్దారు. జయం రవి, కార్తి, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రెహమాన్ అందించిన సంగీతం మొదటి భాగంలో ఆకట్టుకుంది.