నేడే ఆఖరి ఫైట్; సీరీస్‌పై భారత్ గురి
మూడు టీ20ల సీరీస్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సీరీస్ కొట్టేయాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. పృథ్వీ షాకు చివరి మ్యాచ్‌లోనైనా చోటు కల్పించే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే ఆస్కారం ఉంది. మరోవైపు సీరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని కివీస్ పట్టుదలతో ఉంది.