• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అప్పుడే నాలో మార్పు వచ్చింది: ప్రియాంక చోప్రా

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తల్లి అయ్యాక తన మనస్తత్వంలో మార్పు వచ్చిందని చెప్పింది. ‘మతృత్వం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. నాకు ఎన్నో జాగ్రత్తలు నేర్పించింది. నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహించారు. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నేను నా కూతురికి అలానే ప్రేమ పంచడానికి ప్రయత్నిస్తున్నాను’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

  ఆ దర్శకుడు నా లోదుస్తులు విప్పమన్నాడు: స్టార్ హీరోయిన్

  ఓ బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులు విప్పమన్నాడని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో నేను ఒక సినిమా చేస్తున్నా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో డైరెక్టర్ నా దగ్గరకొచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు నా లో దుస్తులు తీసేయాలన్నాడు. లో దుస్తులు తీసేస్తేనే సినిమా బాగా ఆడుతుందన్నాడు. నేను అందుకు అంగీకరించలేదు. అతడిపై చాలా కోపం వచ్చింది. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా.’’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.

  నేను ‘ఆర్ఆర్ఆర్’ చూడలేదు: ప్రియాంక చోప్రా

  తాను ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. ఇందుకు సమయం లేకపోవడమే కారణమని చెప్పింది. తాజాగా ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఎక్కువగా సినిమాలు చూడను. టీవీ షోలు ఎక్కువగా చూస్తుంటా.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చూడలేదనే ప్రియాంక వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఇప్పటివరకు నీకు 3 గంటల సమయం దొరకలేదా’ అంటూ ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు.

  చాలామందితో డేటింగ్ చేశా: ప్రియాంక

  తాను చాలా మందితో డేటింగ్ చేసినట్లు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. ‘కాల్ హర్ డాడీ’ పాడ్‌క్యాస్ట్‌లో ప్రియాంక మాట్లాడుతూ ‘‘నా పెళ్లి కాక ముందు చాలా మందితో డేటింగ్ చేశా. ఒకరితో బ్రేకప్ అవగానే మరొకరిని లవ్ చేసేదాన్ని. ఎప్పుడూ ఎవరో ఒకరిని లవ్ చేస్తూనే ఉండేదాన్ని. నాతో పనిచేసిన కోస్టార్స్‌తోనే ఎక్కువగా డేటింగ్ చేశాను. నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరకు నిక్ జొనాస్‌ను ప్రియుడుగానే కాక భర్తగా స్వీకరించాను.’’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.

  ఆ పని చేసి 3 సినిమాలు కోల్పోయా: ప్రియాంక చోప్రా

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ముక్కు సర్జరీ వికటించటంతో 3 సినిమాల్లో నుంచి తనను తీసేశారని చెప్పింది. ‘‘20 ఏళ్ల కింద శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేదాన్ని. డాక్టర్లు నా ముక్కుకు ఆపరేషన్ చేశారు. దీంతో నా ముఖం మారిపోయి.. అంద విహీనంగా తయారయ్యా. దీంతో అప్పటికే సైన్ చేసిన 3 సినిమాల నుంచి నిర్మాతలు నన్ను తీసేశారు. ఆ తర్వాత ముక్కును సరిచేసేందుకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  ప్రియాంక నెక్లెస్ రూ.204 కోట్లా?

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల మెట్ గాలా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సరికొత్త ఫ్యాషన్‌తో రెడ్ కార్పెట్‌పై హోయలుపోయింది. ఈ ఈవెంట్‌లో ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో తళుక్కుమంది. కాగా ఈ ముద్దుగుమ్మ వజ్రాల నెక్లెస్ కూడా ధరించి మెరిసింది. ఈ నెక్లెస్‌ను 11.6 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. ప్రస్తుతం ఈ నెక్లెస్ ధర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెక్లెస్ ధర అక్షరాల రూ.204 కోట్లని సమాచాారం. ఈ మెట్ గాలా పూర్తయిన తర్వాత ఈ … Read more

  ఓ అబ్బాయి నా బాల్కనీలోకి దూకాడు: ప్రియాంక చోప్రా

  బాలీవుడ్ హీరోయిన్ తన చిన్న నాటి జ్ణాపకాలను గుర్తు చేసుకుంది. ‘‘నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయంలో కొంతమంది అబ్బాయిలు వెంటపడేవారు. ఒక రోజు రాత్రి ఓ అబ్బాయి ఏకంగా మా ఇంటి బాల్కనీలోకి దూకాడు. నేను భయంతో ఇంట్లోకి పరుగులు పెట్టాను. వెంటనే మా నాన్న నా గది కిటికీని మూయించాడు. మా నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచారు. నేను ఎక్కడికి వెళ్లినా తోడుగా ఒకరిని పంపేవారు. మా నాన్నను కోల్పోవటం దురదృష్టకరం.’’ అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యింది.

  ప్రియాంక చోప్రా కూతురిని చూశారా?

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ పాప్ గాయకుడు నిక్ జొనాస్‌లు సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత వారి కూతురు మాల్తి మరియెస్‌ను ప్రపంచానికి చూపించారు. తాజాగా ప్రియాంక చోప్రా తన కూతురికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇటీవలే మాల్తి పుట్టినరోజు జరిగింది. కాగా ఓ అవార్డుల వేడుకకు నిక్, ప్రియాంకలు తమ కూతురితో కలసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. Courtesy Twitter: Priyanka Chopra … Read more

  ప్యారిస్‌లో హీట్ పెంచేసిన ప్రియాంక చోప్రా

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యం ఎదో ఒక ఈవెంట్‌లో మెరిసే ఈ భామ ప్రస్తుతం పారిస్‌లో బల్గారీ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్కిన్ ఫిట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన ప్రియాంకను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Courtesy Instagram: … Read more