• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిగ్‌బాస్ నుంచి క్రేజీ ప్రోమో

  బిగ్‌బాస్ నుంచి మరో క్రేజీ ప్రోమో వచ్చింది. రమేష్-రాధల పాత్రలతో ప్రోమోను ఓ రేంజ్‌లో తీశారు. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటలు ఇక సాగవని.. బిగ్‌బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని తెలిసే విధంగా ఈ ప్రోమో వదిలారు. బిగ్‌బాస్ 7 సీజన్ వచ్చే నెల 3న గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం. అమర్‌దీప్-తేజస్విని, బుల్లెట్ భాస్కర్, మోహన భోగరాజు, వర్ష, శోభాశెట్టి, బ్యాంకాక్ పిల్ల, సాకేత్, ఈటీవీ ప్రభాకర్, సురేఖావాణి, సుప్రీత, తదితరులు ఈ సీజన్‌లో సందడి చేయనున్నట్లు టాక్.

  ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో

  టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజైంది. ‘టికెటే కొనకుండా’ అనే సాంగ్ ప్రోమోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ మిరియాల ఈ సాంగ్‌ను ఆలపించారు. ఫుల్ లిరికల్ సాంగ్ జూలై 26న విడుదల కానుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. Atla untadi Mana Tillu Thone ?❤#TilluSquare … Read more

  బిగ్‌బాస్ 7 ప్రోమో వచ్చేసింది

  బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సారి మరిన్ని ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగులు ఉంటాయని ప్రోమోలో తెలిపారు. కాగా సీజన్ 7కు దగ్గుబాటి రానా హోస్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షోలో మంగ్లీ, మోహన భోగరాజు, హేమచంద్ర, దీపిక పిల్లి, రష్మీ గౌతమ్, సాకేత్ కొమండూరి, విష్ణప్రియ, సిద్ధార్థ్ వర్మ, ఈటీవీ ప్రభాకర్, మిత్రా శర్మ, ఐశ్వర్య, శోభాశెట్టి, పండు, జబర్దస్త్ అప్పారావు, ప్రత్యూష, సాయిరోనాక్, ఎస్తేర్, నోయల్, తేజస్విని, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్లుగా ఉంటారని టాక్. #BiggBossTelugu7 – A … Read more

  ‘ఖుషీ’ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

  టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఖుషీ’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్‌గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. #Aradhya song … Read more

  ప్రభాస్ ప్రోమో వచ్చేసింది

  అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్‌స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్2 ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ కూడా సందడి చేశాడు. ఈ ప్రోమోలో ఈ ఇద్దరి యంగ్ హీరోలతో హోస్ట్ బాలకృష్ణ తెగ అల్లరి చేశారు. ప్రభాస్‌కు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి బాలయ్య ఆరాతీశాడు. తనను కూడా డార్లింగ్ అంటూ పిలవాలని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరాడు. పెళ్లి ఎప్పుడు అనగా సల్మాన్‌ఖాన్ పెళ్లి తర్వాత అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.

  చిరు క్లౌడ్ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్

  మెగాస్టార్ చిరంజీవి క్లౌడ్ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. క్లౌడ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది. తను నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్ర విశేషాలను చిరు ఈ ఇంటర్య్యూలో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో యాంకర్ శ్రీముఖి మెగాస్టార్‌ నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పించినట్లు తెలుస్తోంది. ఫుల్ ఇంటర్వ్యూ కోసం చిరు అభిమానులు, సినీప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

  Biggboss 6: కంటెస్టెంట్స్‌తో ఫ‌న్ మామూలుగా లేదుగా!

  బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 నేడు ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశారు. నాగార్జున ఎప్ప‌టిలాగే త‌న ఎన‌ర్జీతో అల‌రిస్తున్నాడు. కొంత‌మంది కంటెస్టెంట్స్ వాయిస్‌ను వినిపించారు, కానీ మోహాలు చూపించ‌కుండా ప్రోమోను రిలీజ్ చేస్తారు. అందులో సింగ‌ర్ రేవంత్, చ‌లాకీ చంటీల గురించి క్లియ‌ర్‌గా తెలుస్తుంది. ఇక మిగ‌తా కంటెస్టెంట్స్ ఎవ‌రో ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలుసుకోవ‌చ్చు. ఈ సారి హౌజ్‌లో అమ్మాయిల డామినేష‌న్ ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

  సెప్టెంబ‌ర్ 4 నుంచే బిగ్‌బాస్ 6 ప్రారంభం

  తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 6 సెప్టెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నేడు విడుద‌ల చేశారు. కంటెస్టెంట్స్‌ను ఆగ‌స్ట్ చివరి వారం నుంచి క్వారెంటైన్‌లో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈసారి ఇద్ద‌రు కామ‌న్ పీపుల్ షోలో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ గురించి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అమ‌ర్‌దీప్‌, చ‌లాకీ చంటి, గీతూ రాయ‌ల్, ఆది రెడ్డి, శ్రీహాన్ , నేహా చౌద‌రి, దీపికా పిల్లి, ఉద‌య‌భాను, యాంక‌ర్ ప్ర‌త్యూష‌ త‌దిత‌రుల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది.

  ‘ది ఘోస్ట్’ నుంచి ప‌వ‌ర్‌ఫుల్ ప్రోమో రిలీజ్

  కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తున్న ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. త‌మ‌హ‌గానే అనే ప‌వ‌ర్‌ఫుల్ ఆయుధాన్ని చూపించారు. త‌మ‌హ‌గానే అంటే విలువైన ఉక్కుతో చేసిన ఆయుధం అనే అర్థం. నాగార్జున వైల్డ్ లుక్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు. ఆగ‌స్ట్ 25న ది ఘోస్ట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో సినిమా రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తుంది.

  బిగ్‌బాస్ 6 ప్రోమో వ‌చ్చేసింది

  తెలుగువారికి ఎంతో ఇష్ట‌మైన బిగ్‌బాస్ రియాలిటీ షో సీజ‌న్ 6 త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. ఎప్ప‌టిలాగే నాగార్జున ఈ ప్రోమోలో మెరిసి ప్రేక్ష‌కుల‌ను ఆనంద‌ప‌రిచాడు. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో షో ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ గురించి సోష‌ల్‌మీడియాలో వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. యాంక‌ర్ ఉద‌య‌బాను, వ‌ర్షిణి, జ‌బ‌ర్ధ‌స్త్ ఆది, దీపికా పిల్లి, నిఖిల్ వంటి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.