బంగాళాఖాతంలో అల్పపీడనం; ఏపీలో వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈ నెల 29, 30 తేదీల్లో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాలతో పాటు రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. పార్వతీమన్యం, అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, చిత్తూరు, కాకినాడ తదితర జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జి.మాడుగులలో 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.