• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు

    తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వాన పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.

    గత కొద్దిరోజులుగా వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్లు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కోతల సీజన్ మెుదలయ్యింది. చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతుండటంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతుంది. ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టం నీటిపాలవుతుందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. 

    @envato( representational image )

    ఉమ్మడి నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ఎండలు మండుతూనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా పంటనష్టం వాటిల్లుతుంది. నల్గొండలో పలుచోట్ల పంటలు నీటమునిగాయి. ప్రతి ఏటా ఇలా అకాల వర్షాలు కర్షకుల కష్టానికి గండి కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే తమకు దారి చూపాలని వారు కోరుకుంటున్నారు. 

    ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రభుత్వం కూడా వేగవంతం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులతో సమావేశమై కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్‌ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి కొనుగోలు కేంద్రాలు తెరిచేలా చేశారు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ కూడా ఊపందుకోనుంది. నెల క్రితం పంట నష్టపోయిన వారికి సీఎం కేసీఆర్ సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv