తెలంగాణలో 57 నూతన కోర్టులు
తెలంగాణలో కొత్తగా 57 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై జరిగే నేరాలను విచారించేందుకు గాను ప్రత్యేకంగా 10 కోర్టులు ఏర్పాటు చేశారు. కొత్త కోర్టుల్లో సిబ్బందిని నియమించేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.