రంజీల్లో అదరగొట్టిన జడేజా
గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రంజీల్లో అదరగొట్టాడు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. మెుత్తం 8 వికెట్లు తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం గాయంతో జట్టుకు దూరమయ్యాడు జడ్డూ. ఇప్పుడు దేశవాలీ క్రికెట్లో సత్తాచాటి మళ్లీ రావాలని అనుకుంటున్నాడు. ఇందుకు అనుగుణంగా సెలెక్టర్లు అనుమతి ఇచ్చారు. అటు బ్యాటింగ్‌లోనూ ఫర్వాలేదు అనిపించాడు. 35 బంతుల్లో 22 పరుగులు చేశాడు.