ఓడిపోయే మ్యాచ్ గెలిచామని భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకే ఈ ఘనత దక్కుతుందని పాండ్యా చెప్పాడు. ‘మేం బ్యాటింగ్‌లో ఒత్తిడికి గురయ్యాం. త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారుతుందని భావించాం. కానీ, జడేజాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించిన తీరు అద్భుతం. చేజారుతున్న మ్యాచ్‌ని మలుపు తిప్పి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో జట్టు ఆటతీరు పట్ల నిజంగా గర్వంగా ఉంది’ అని పాండ్యా చెప్పాడు. తొలి వన్డేలో రాహుల్, జడేజా కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్