• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టాస్ ఓడిన భారత్.. టీం ఇదే!

  మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్ల వివరాలు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.

  ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

  వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణి కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా బౌలర్ల ధాటికి 199 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ(85), రాహుల్‌(97*) రాణించడంతో టీమిండియా విజయం సాధించిది. స్కోర్లు భారత్‌ 201/4, ఆస్ట్రేలియా 199 ఆలౌట్.

  వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి పోరు నేడే

  వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సిద్ధమైంది. నేడు చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ గిల్‌ అందుబాటులో లేకున్నా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషనే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజాలతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చెపాక్‌ స్టేడియంలో స్పిన్నర్లదే హవా. కాబట్టి జడేజా, కుల్‌దీప్‌లకు తోడుగా అశ్విన్‌ను ఆడించొచ్చు. బుమ్రా, సిరాజ్‌లను మాత్రమే పేసర్లుగా బరిలోకి దింపొచ్చు. మ. … Read more

  ‘2 నిమిషాలు కూడా ఉండలేరా భయ్యా’

  WTC ఫైనల్లో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు నిమిషాలు కూడా క్రీజులో ఉండలేని స్థితిలో భారత బ్యాటర్లు ఉన్నారని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఐపీఎల్ మోజులో పడి దేశం కోసం ఆడుతున్న సంగతినే మరిచిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరూ ఫన్నీ మీమ్స్‌ పోస్ట్ చేస్తున్నారు. Another icc trophy pic.twitter.com/uFHk15sRBE — 8384 ?? (@IconTweetz) June 11, 2023

  WTC ప్రొమో విడుదల

  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు(WTC) సంబంధించిన ప్రొమోను ఐసీసీ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ టోర్నీపై పెద్దగా ప్రచారం లేకున్నా.. అభిమానుల్లో మాత్రం మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. టీమిండియా, ఆసీస్ మధ్య ఈనెల 7 నుంచి 11వరకు WTC ఫైనల్ జరగనుంది. ఫైనల్ సమరానికి సిద్ధమా అని ఐసీసీ ట్వీట్ చేసింది. ఇంగ్లాండ్‌- ఓవల్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

  స్టీవ్‌ స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌

  [VIDEO](url): వైజాగ్‌ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. షాన్‌ అబాట్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాను కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. గాల్లో కుడివైపునకు డైవ్‌ చేస్తూ స్మిత్‌ పట్టిన క్యాచ్‌ వీడియో అప్పటికప్పుడే నెట్టింట వైరల్‌గా మారింది. Unreal catch by Steve Smith pic.twitter.com/MWMuNJmG7w — Sexy Cricket Shots (@sexycricketshot) March 19, 2023

  విశాఖ వన్డేకు వరుణుడి ముప్పు!

  భారత్‌-ఆసీస్‌ మధ్య రేపు విశాఖలో జరగనున్న రెండో వన్డేకు వరణుడి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే విశాఖలో భారీ వర్షం కురవగా రేపటి నుంచి 3 రోజుల పాటు వానలు కురిస్తాయని IMD హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు రెండో మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. క్రికెటర్లకు నోవాటెల్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.

  గుడ్‌న్యూస్‌: విశాఖ వన్డేకు రోహిత్‌ వచ్చేస్తున్నాడు!

  బామ్మర్ది పెళ్లి వ‌ల్ల తొలి వ‌న్డేకు దూర‌మైన రోహిత్ శర్మ‌ రెండో వ‌న్డేలో మ‌ళ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌నున్నాడు. తొలి వ‌న్డేకు రోహిత్ దూరం కావ‌డం వ‌ల్ల‌ ఆ బాధ్య‌త‌ల్ని హార్ధిక్ పాండ్యా అద్భుతంగా నిర్వహించాడు. రోహిత్ రాకతో అతని స్థానంలో ఆడిన ఇషాన్ కిష‌న్‌ తిరిగి బెంచ్‌కే పరిమతమయ్యే అవకాశముంది. అయితే రోహిత్ రాక‌తో టాప్ ఆర్డ‌ర్ బ‌లోపేతం కానున్న‌ది. రెండో వ‌న్డేలో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ ఉవ్విళ్లూరుతోంది. కాగా రెండో వన్డే విశాఖలో జరగనుంది.

  ఓడిపోయే మ్యాచ్‌‌ని గెలిచాం: పాండ్యా

  ఓడిపోయే మ్యాచ్ గెలిచామని భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకే ఈ ఘనత దక్కుతుందని పాండ్యా చెప్పాడు. ‘మేం బ్యాటింగ్‌లో ఒత్తిడికి గురయ్యాం. త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారుతుందని భావించాం. కానీ, జడేజాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించిన తీరు అద్భుతం. చేజారుతున్న మ్యాచ్‌ని మలుపు తిప్పి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో జట్టు ఆటతీరు పట్ల నిజంగా గర్వంగా ఉంది’ అని పాండ్యా చెప్పాడు. తొలి వన్డేలో రాహుల్, జడేజా కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి … Read more

  INDvsAUS: భారత్ విజయం

  వాంఖడే వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాపై భారత బౌలర్లు విజృంభించారు. 188 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్లు షమీ, సిరాజ్‌ ధ్వయం చెరో 3 వికెట్లు తీసుకున్నారు. జడేజా 2 వికెట్లు పడగొట్టగా, హార్దిక్, కుల్దీప్ తలో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్‌ ఒక్కడే 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో కంగారూ బౌలర్లు భారత్‌ను బెంబేలెత్తించారు. కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకంతో బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాడు.