• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RAKESH MASTER: ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్

    దివంగత కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ‘‘రాకేశ్ మాస్టర్ గ్రేట్ డ్యాన్సర్. ఆయనతో ఎనిమిదేళ్ల అనుబంధం నాది. ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నా. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ పెట్టి రాస్తున్నారు. దాని వల్ల చాలామంది బాధపడతారు. వాస్తవాలు మాత్రమే రాయండి. నాపై ఏదేదో రాసేస్తున్నారు.’’ అంటూ శేఖర్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు.

    బోరున విలపించిన శేఖర్‌ మాస్టర్‌

    రాకేష్‌ మాస్టర్‌ పార్ధీవ దేహాన్ని చూసి ఆయన శిష్యుడు, స్టార్‌ కొరియోగ్రాఫ్‌ శేఖర్‌ మాస్టర్‌ కన్నీరు పెట్టుకున్నారు. గురువు పార్థీవ దేహానికి నమస్కారం చేస్తూ బోరున విలపించాడు. తీవ్ర ఆవేదనతో తన గురువుకు కన్నీటి వీడ్కోలు పలికాడు. శేఖర్‌ మాస్టర్‌ రాకతో ఆ ప్రాంతమంతా భావోద్వేగంగా మారిపోయింది. రాకేష్‌ మాస్టర్‌ దగ్గరే శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ మెళుకువలు నేర్చుకున్నాడు. అయితే వారి మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తన గురువును కడసారి చూసేందుకు శేఖర్‌ మాస్టర్‌ వస్తారో లేదోనని అంతా భావించారు.