• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గడ్డకట్టిన కులూ జలపాతం; పిక్స్ వైరల్

    హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ[ జలపాతం](url) గడ్డ కట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డ కట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కాగా హిమాలయాల చెంతనే ఉండటంతో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. తాగే మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. On #Udaipur – #Tindi road… Near Bhim bagh ? 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat … Read more

    అమెరికాలో అల్లకల్లోలం

    మంచు తుఫాన్ ప్రభావంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది. మంచు గడ్డలతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక విలవిలలాడుతున్నారు. [తుఫాన్](url) ధాటికి ఇప్పటివరకు దాదాపు 60 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. 15 వేల విమానాలు రన్‌వేపైనే ఆగిపోయాయి. అమెరికా అంతటా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్లుగా ఉన్నాయి. The monster snow storm gripping North America has now claimed dozens … Read more

    అమెరికాను వణికిస్తోన్న బాంబ్ సైక్లోన్‌

    అగ్రరాజ్యం అమెరికా ఇంకా మంచు దుప్పట్లోనే ఉంది. బాంబు సైక్లోన్ భీభత్సంతో అమెరికాలో ఎటుచూసినా మంచే కనపడుతోంది. రహదారులు, కార్లు పూర్తిగా [మంచు](url)తో కప్పి ఉన్నాయి. ఉత్తర అమెరికాలో అత్యల్పస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉంటున్నారు. విద్యుత్ కోతల వల్ల హీటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు అల్లాడతున్నారు. మంచు తఫాన్ కారణంగా ఇప్పటివరకు 26 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. A powerful arctic blast has turned deadly in North America, where powerful … Read more

    సబ్బునీటి బుడగ గడ్డ కట్టడం చూశారా?

    ‘ఫ్రోజెన్‌’ సినిమా చూస్తుంటే అందులో మంచు యానిమేషన్స్‌ మనల్ని కట్టిపడేస్తాయి. ఎల్సా తన మంత్ర శక్తులతో మంచును పుట్టిస్తుంటే పువ్వుల ఆకారంలో ఉండే ఆ కణాలు మనసుకు ఇంపుగా అనిపిస్తాయి. కానీ మంచు కణాలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాయని చాలా మందికి తెలియదు. మనది ఉష్ణమండలం దేశం కాబట్టి చూసే అవకాశం కూడా తక్కువే. కానీ సబ్బునీటి బుడగ గడ్డకడుతుండగా తీసిన ఈ వీడియో మీకు నిజంగా సినిమాకు మించిన అనుభూతిని పంచుతుంది.