• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూకంప విధ్వంసం; 8 వేలకు చేరిన మృతులు

    తుర్కియే, సిరియాల్లో [భూకంపం](url) సృష్టించిన విధ్వంసానికి 8 వేల మంది బలయ్యారు. దాదాపు 25 వేలకు మందికి పైగా గాయపడ్డారు. భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుర్కియేలో 5,600 మంది, సిరియాలో 2,040 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా భవన శిథిలాల కింద ఇంకా 1,80,000 మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. The last minutes of the Turkish family's life were caught … Read more

    తుర్కీయేలో భీకర పరిస్థితులు; డ్రోన్ విజువల్స్ వైరల్

    తీవ్ర భూకంపం ధాటికి తుర్కీయే, సిరియాల్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా శిథిల భవనాలు, శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. భూకంపం సృష్టించిన కల్లోలానికి దాదాపు 5000 మందికి పైగా మరణించారు. 25 వేలకు మందిపైగా క్షతగాత్రులుగా మిగిలారు. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. అక్కడి పరిస్థితులను డ్రోన్ విజువల్స్ మన కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A drone video released by Humanitarian Relief Foundation shows the extent of … Read more

    మృత్యుంజయులు ఆ చిన్నారులు

    భూకంపం ధాటికి తుర్కీయే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడ చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ శిథిలాల్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి ఇద్దరు చిన్నారులు సజీవంగా బయటపడ్డారు. నూర్, హరుణ్ అనే ఇద్దరు చిన్నారులు రెండు రోజులపాటు శిథిలాల కిందే చిక్కుకుని మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరు దేశాల్లోనూ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. This poor child is the sole survival of a whole … Read more

    టర్కీ భూకంపం; 600కు చేరువగా మృతులు

    టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప ధాటికి 570 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. 1,000 మందికి పైగా క్షతగాత్రులు అయినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు [పేకమేడ](url)ల్లా కుప్పకూలాయి. సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. #Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey Prayers for Turkey … Read more

    టర్కీ భూకంపం; 300 మంది మృత్యువాత

    టర్కీ, సిరియా దేశాలను భారీ [భూకంపం](url) కుదిపేసింది. భూకంప తీవ్రతకు ఇరు దేశాల్లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 300 మంది మరణించినట్లు తెలుస్తోంది. సుమారు 1,000 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మలట్యా, ఉర్ఫా, దియర్‌బకీర్, అలెప్పో, హమా, లటాకియా ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా టర్కీలో భూకంపాలు సర్వసాధారణమే. ఏడాదికి కనీసం రెండు, మూడు సార్లు భూకంపాలు వస్తుంటాయి. Turkey? #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani … Read more