• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌ షురూ.. అదిరిపోయిన ట్రైలర్!

  [VIDEO](url): హాలీవుడ్ యాక్టర్‌ రిచర్డ్‌ మాడెన్‌, బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటించిన స్పై థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్‌ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌ విడుదల చేసింది. భారీ క్యాస్టింగ్‌తో ఈ ట్రైలర్‌ ఎంతో స్టైలిష్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. కాగా ఏప్రిల్‌ 28 నుంచి ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చని ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. see @_richardmadden … Read more

  ‘రిచి గాడి పెళ్లి’ ట్రైలర్ రిలీజ్

  నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, ఎస్కే సత్య, మర్రి కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రిచి గాడి పెళ్లి’ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నటీనటులు తమ పాత్రల్లో అదరగొట్టారు. ట్రైలర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కేఎస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కేఎస్ హేమరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సతీశ్ శెట్టి, కియారా నాయుడు కీలక పాత్రలు పోషించారు. వచ్చే నెల 3న ఈ మూవీ … Read more

  ఉత్కంఠగా ‘వేద’ ట్రైలర్; శివరాజ్ 125వ మూవీ

  కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శివరాజ్ తన నటనతో అదరగొట్టాడు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు హర్ష దర్శకత్వం వహించాడు. శివరాజ్‌కు ఇది 125వ సినిమా. గీతా పిక్చర్స్ పేరుతో ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడలో సూపర్ హిట్‌గా నిలవడంతో తెలుగులో కూడా త్వరలో విడుదల చేయనున్నారు.

  ఆకట్టుకుంటున్న లవ్ టుడే ట్రైలర్

  తమిళంలో ఘన విజయం సాధించిన లవ్ టుడే చిత్రం తెలుగులో విడుదల కానుంది.ప్రేమికులకు పెళ్లి చేయాలంటే సెల్ ఫోన్లు మార్చుకోవాలంటూ పెద్దలు పెట్టిన కండిషన్ తో నడిచే చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభవ్వగా..అమ్మాయి తరఫు ఇంటిపెద్దగా సత్యరాజ్ నటించారు. ఆయన పెట్టిన కండిషన్ ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్థల ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

  ‘విక్ర‌మ్ వేద’ ట్రైల‌ర్ రిలీజ్

  బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విక్ర‌మ్ వేద థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఈరోజు రిలీజ్ అయింది. ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్, ఒక గ్యాంగ్‌స్ట‌ర్ మ‌ధ్య జ‌రిగే వార్ కథాంశంతో ఇది తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 30న సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఇది త‌మిళ్ సూప‌ర్ హిట్ మూవీ విక్ర‌మ్ వేద రీమేక్‌గా తెర‌కెక్కింది. ఒరిజిన‌ల్‌లో మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి హీరోలుగా న‌టించారు. దాన్ని తెర‌కెక్కించిన పుష్క‌ర్ & గాయ‌త్రి హిందీలో కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

  పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1పై సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆస‌క్తి

  మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్-1’ సినిమా సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను చూసేందుకు సాధార‌ణ ప్రేక్ష‌కులు ఆస్తిక‌రంగా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇన్నిరోజులు ఇంటికే ప‌రిమిత‌మైన సీనియ‌ర్ సిటిజ‌న్లు కూడా ఈ మూవీని థియేట‌ర్ల‌లో చూడాల‌నుకుంటున్నార‌ట‌. త‌మిళ‌నాడులో ముఖ్యంగా ఈ ర‌క‌మైన టాక్ వినిప‌స్తుంది. మ‌ణిర‌త్నం సినిమాల‌కు ఉండే క్రేజ్ అలాంటిది మ‌రి. దాంతోపాటు ఆయ‌న‌ మొద‌టిసారిగా ఇలా యుద్ధానికి సంబంధించిన చారిత్రాత్మ‌క క‌థ‌ను తెర‌కెక్కించ‌డం, ప్ర‌ముఖ తార‌లు అంద‌రూ న‌టించ‌డం కూడా ముఖ్య కార‌ణంగా క‌నిపిస్తుంది.

  ర‌ష్మిక తొలి హిందీ మూవీ ‘గుడ్‌బాయ్’ ట్రైల‌ర్ రిలీజ్

  ర‌ష్మిక మంద‌న న‌టించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘గుడ్‌బాయ్’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్‌లో ఫ‌న్, ఎమోష‌న్, స‌మాజంపై సెటైర్లు అన్నీ క‌లిసి ఉన్నాయి. ర‌ష్మిక తండ్రిగా అమితాబ్ న‌టించాడు. పుష్ప సినిమాతో త‌న‌కు బాలీవుడ్ ప్రేక్ష‌కుల నుంచి చాలా ప్రేమ ల‌భించింది. ఇది నా మొద‌టి హిందీ సినిమా. దీన్ని కూడా అంతే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ర‌ష్మిక చెప్పింది. ఈ మూవీ అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. విశ్వ‌క్ ఏమ‌న్నాడంటే

  యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ గురించి మాట్లాడాడు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని సినిమా వాళ్ల గురించి కొంత‌మందికి ఉండే ఆ చిన్న‌చూపు అంశాన్ని లేవ‌నెత్తార‌ని చెప్పాడు. ఈ పాయింట్‌ను క‌రెక్ట్‌గా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చెప్పి ఉంటాడ‌ని అనుకుంటున్నా అన్నాడు. సెప్టెంబ‌ర్ 16న అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడాల‌ని కోరాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించారు.

  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్

  సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక అమ్మాయిని క‌ష్ట‌ప‌డి సినిమాలో న‌టించేందుకు డైరెక్ట‌ర్‌ ఒప్పిస్తాడు. కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అత‌డి సినిమా క‌ల నేర‌వేరిందా లేదా అనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ … Read more

  త‌మ‌న్నా ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

  త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. మ‌ధుర్ బండార్క‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌బ్‌లో లేడీ బౌన్స‌ర్‌గా ఉద్యోగం చేసే ఒక అమ్మాయి క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ట్రైల‌ర్ ఆద్యంతం కామెడీగా సాగింది. త‌మ‌న్నా మొద‌టిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుండ‌టంతో దీనిపై ఆస‌క్తి పెరిగింది. సెప్టెంబ‌ర్ 23నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, త‌మిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది.