• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

    ఎన్నికల నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 46 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉండగా, అందులో 13 తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈనెల 31 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

    17 రోజులు.. 41 భారీ బహిరంగ సభలు

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన 17 రోజుల్లో 41 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నవంబంర్ 3వ తేదీ నాటికే సీఎం కేసీఆర్ 26 సభలకు హాజరయ్యేలా ప్రణాళిక రచించారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

    గ్రూప్2 పరీక్షలు జరిగేనా..?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పలు రకాల పోటీ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్2 పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల ప్రక్రియతో పాటు గ్రూప్స్ పరీక్షలకు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అవసరం ఉండటమే దీనికి కారణం. నవంబర్ 30న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 25 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్‌టీ-ఎస్‌జీటీ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం ఉంది.

    15 నుంచి ప్రజల్లోకి సీఎం కేసీఆర్

    ఈ నెల 15 నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్స్ అందజేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి.. 17న సిద్ధిపేట, సిరిసిల్ల.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. చత్తీస్‌ఘర్‌లో నవంబర్ 7, 17న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 23న.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

    39 మందితో బీజేపీ తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

    ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

    8న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

    తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 8-10వ తేదీల మధ్య విడుదల కానుంది. అయితే ఆదివారమే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, చత్తీస్‌ఘర్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 10-15 మధ్య ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.