‘బాలాజీ దర్శన్’కు అనూహ్య స్పందన
టీఎస్ఆర్టీసీ తీసుకొచ్చిన ‘బాలాజీ దర్శన్’ టికెట్లను మంచి స్పందన లభిస్తోంది. ఏడు నెలల్లోనే 77వేలకు పైగా టికెట్లు విక్రయించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శనానికి కూడా టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. ఈ మేరకు టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది జులైలో ఈ సౌలభ్యాన్ని తీసుకు రాగా ఇప్పటివరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకున్నారు. www.tsrtconline.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.