• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌ టికెట్ దందా

  హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వద్ద బ్లాక్‌ టికెట్‌ దందా జరుగుతోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్న యువకులు స్టేడియం బయట బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 15 మందిని అరెస్ట్ చేసి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఉప్పల్‌లో మ్యాచ్‌ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తాజాగా మళ్లీ బ్లాక్‌ దందా బయటపడింది. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్‌లో తొలి వన్డే జరగబోతోంది.

  HCAలో మరో లొల్లి

  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మరో వివాదం మొదలైంది. అకాడమీలోని అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. HCA జనరల్‌ సెక్రటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశారు. దళితుడని తనను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద మ్యాచ్‌ జరుగుతున్నా తనను కనీసం ఆహ్వానించలేదని వాపోయారు. టికెట్లు పూర్తిగా పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఆన్‌లైన్‌ టికెట్లలోనూ గోల్‌మాల్‌ చేశారని ఆరోపించారు. ఇప్పటికే HCAపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ విజయ్‌ ఆనంద్‌ ఆరోపణలు కీలకంగా మారాయి.

  రేపటి నుంచే ఉప్పల్ టికెట్లు; ఎంతంటే?

  ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరగబోయే తొలి వన్డేకు సంబంధించి రేపటి నుంచి టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. జనవరి 13వ తేదీ 6 వేలు, 14న 7 వేలు, 15న 7 వేలు, 16న 9417 టికెట్లను పేటీఎం ద్వారా విక్రయించనున్నట్లు వివరించారు. టికెట్ రేట్లు రూ.850 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 4 టికెట్లు మాత్రమే ఇస్తామని.. బుక్ చేసుకున్నవారు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో టికెట్లు తీసుకోవచ్చని చెప్పారు.

  2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

  ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more

  ఉప్పల్‌ స్టేడియం వద్ద గందరగోళం

  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో రచ్చ వీడటం లేదు. ఆదివారం ప్రత్యేక AGM సమావేశం కోసం ఉప్పల్‌ స్టేడియంకు వెళ్లిన BCCI మాజీ అధ్యక్షుడు శివలాల్‌, HCA మాజీ అధ్యక్షులు జి.వినోద్‌, అర్షద్‌ సహా క్లబ్‌ కార్యదర్శులను భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. వారు గేటు బయటే టెంటు వేసుకుని సమావేశం నిర్వహించారు. జనవరి 10న HCAకు ఎన్నికలు నిర్వహిస్తామని ఏకగ్రీవ తీర్మాణం చేశారు. HCA అధ్యక్షుడు అజహార్‌ వ్యవహారశైలిపై వారు తీవ్రంగా మండిపడ్డారు.

  ఉప్పల్ లో మరో అంతర్జాతీయ మ్యాచ్ !

  హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరో మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి-మార్చి మధ్యలో ఆస్ట్రేలియాతో భారత్ సిరీస్ ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా నాలుగు టెస్టులు ఆడనున్నారు. ఇందులో ఒకపింక్ బాల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో మెుదటి మ్యాచ్ ను ఉప్పల్ స్టేడియంలో నిర్వహించేందుకు బీసీసీఐ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇలా జరిగితే మరో అంతర్జాతీయ మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక కానుంది.

  మూడేళ్ల తర్వాత HYDలో మ్యాచ్

  ఉప్పల్ వేదికగా నేడు INDVsAUS మూడో టీ20 జరగనుంది. దాదాపు మూడేళ్ల తరువాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. చివరి మ్యాచ్ 2019లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి 416పరుగులు చేశాయి. సహజంగా ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో మరో హైఓల్టేజ్ మ్యాచ్‌కు అభిమానులు రెడీ అవుతున్నారు. పైగా, ఈ మ్యాచ్.. సిరీస్ డిసైడర్ కావడంతో మరింత కిక్కునిస్తోంది. ఆదివారం అవడం మరో సానుకూలాంశం.

  ALERT: రాత్రి 8తర్వాతే టికెట్లు

  హైదరాబాద్ వేదికగా జరిగే భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ఉదయం ప్రారంభమవుతుందని అంతా అనుకున్నారు. కానీ, రాత్రి 8గంటల నుంచి PAYTMinsiderలో అందుబాటులోకి రానున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి.. ప్రజలను మభ్యపెట్టే అవకాశం ఉంది. కాబట్టి, టికెట్ కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

  IND Vs AUS.. టికెట్ల విక్రయం నేటినుంచే

  భారత్ Vs ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్‌కి ఉప్పల్ వేదిక కానుంది. ఈనెల 25న జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు నేడు ఉదయం 11గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.. PAYTM యాప్ ద్వారా టికెట్‌ను కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.. టికెట్ ధర రూ.300 నుంచి రూ.10వేల వరకు ఉంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.