మంచు మనోజ్ వెడ్డింగ్ సాంగ్: వైరల్
మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారి వివాహానికి సంబంధించిన అద్భుతమైన మూమెంట్స్‌ను ఓ పాట రూపంలో బంధించారు. ‘ఏం మనసో’ అంటూ సాగే ఈ పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. ఈ పాటలో పెళ్లి ప్రారంభం నుంచి వివాహం ముగిసేంత వరకు చోటుచేసుకున్న క్షణాలను చూపించారు. ఈ పాటను తన భార్య మౌనికారెడ్డికి అంకితం ఇస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.