సోషల్ మీడియాలో #JusticeForPreethi ట్రెండింగ్
సోషల్ మీడియాలో #JusticeForPreethi అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని కామెంట్ చేస్తున్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రీతి తుది శ్వాస విడిచింది.