వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన గని చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ యాక్ట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, కన్నడ నటుడు ఉపేంద్ర, టాలీవుడ్ నటులు జగపతి బాబు, నవీన్ చంద్ర, నరేష్ కూడా నటించారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా స్టోరీ ఎలా ఉందో చుద్దాం.
గని(వరుణ్ తేజ్) ఒక ఫేమస్ బాక్సర్ కొడుకు. అతని తండ్రి బాక్సింగ్ చేసిన సమయంలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో మోసగాడిగా ముద్ర పడుతుంది. ఆ క్రమంలో వరుణ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో గెలవాలనే లక్ష్యం, తన తండ్రి పేరును ఎలా కాపాడాడు అనేది సినిమా కథ. అయితే గని తల్లి(నదియా) అతన్ని బాక్సింగ్‌లో పాల్గొననివ్వద్దు. దీంతో గని తన దృష్టిని బాక్సింగ్ వైపు ఎలా మళ్లించాడు..? దానిని తన తల్లికి తెలియకుండా ఎందుకు దాచిపెట్టాడు..? చివరికి ఆమె రియాక్షన్ ఏమిటనేది..? సినిమాలోనే చూడాలి.
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లోగా కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. మూవీ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల వరకు కేవలం గని కథకు సంబంధించిన పాత్రల ఎంట్రీ మాత్రమే ఉంటుంది. హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్ సీన్లలో తాజాదనం కనిపించదు. మరోవైపు బాక్సింగ్ గురించి తల్లీకొడుకుల మధ్య వివాదంలో కూడా కొత్తదనం ఉన్నట్లు లేదు. ఈ క్రమంలో ఇంటర్వెల్ సమయానికి కొంచెం ట్విస్ట్ ఉంటుంది.
సెకండాఫ్ ప్రారంభంలో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. ఈ సీక్వెన్స్‌లలో కొత్తది ఏమీ లేదు. కానీ రొటీన్‌లోనే చిన్న చిన్న మార్పులు చేసి కొద్దిగా ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చివర్లో రెండు బాక్సింగ్ మ్యాచ్‌లు ఆకట్టుకుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్‌లో సినిమా బాగుందని చెప్పవచ్చు. మొత్తంమీద గని చూస్తుంటే పాత స్టోరీకి మార్పులు చేసినట్లు అనిపిస్తుంది.
ఇక గని పాత్రలో వరుణ్ తేజ్ యాక్టింగ్ రెండు కోణాల్లో చూడవచ్చు. ఒకటి తనను తాను మార్చుకుని సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం. మరొకటి యాక్టింగ్ పరంగా వరుణ్ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పవచ్చు. బాక్సింగ్ కోసం ట్రైనింగ్ తీసుకున్న విధానం, క్లైమాక్స్ ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ఫైట్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండాయి. హీరో గతంలో ఏ సినిమాలో కనిపించని కొత్త లుక్లో ఈ మూవీలో కనిపిస్తాడు.
ఇక ఈ మూవీలో వరుణ్ సరసన నటించిన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ ఆకట్టుకుంది. కానీ తనకు కొన్ని సీన్లు మాత్రమే దక్కాయి. మొదటి భాగంలో కనిపించిన హీరోయిన్ రెండో గంటలో అసలు కనిపించకుండా ఉంటుంది. మరోవైపు తనకు రోటిన్ సీన్లు, చప్పగా ఉండే సన్నివేశాలు దక్కాయని చెప్పవచ్చు.
కిరణ్ కొర్రపాటి తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం గని. అతను తన మొదటి ప్రయత్నంలోనే కఠినమైన శైలిని ఎంచుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అనేక సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ అలాంటి కథనాలు తీయాలంటే సరికొత్తగా అమలు చేయాలి. కానీ ఆ విషయంలో డైరెక్టర్ తడిబడినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో అనేక మంది సీనియర్ నటులు యాక్ట్ చేశారు. ఓ సపోర్టింగ్ రోల్‌లో కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఎంట్రీ ఉంటుంది. నరేష్, మరోవైపు బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఓ కీలక పాత్రలో కొనసాగుతాడు. వీరిద్దరు తమ పాత్రలకు సరిపోయారని చెప్పవచ్చు. జగపతి బాబుకి మరో మంచి విలన్ పాత్ర లభించింది. అతను తన పాత్ర మేరకు న్యాయం చేశారు. నవీన్ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీకి తమన్ సంగీతం పలు చోట్ల పనిచేయగా, మరికొన్ని చోట్ల BGM తలనొప్పిగా మారినట్లుగా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్
టైటిల్ సాంగ్
క్లైమాక్స్ సీన్స్
ప్రొడక్షన్ ప్రాసెస్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
స్లోగా సాగే విధానం
ఆశ్చర్యకరమైన అంశాలు లేకపోవడం
కాలం చెల్లిన వైబ్
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!