శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటించిన మూవీ 10th క్లాస్ డైరీస్. ఈ మూవీని గరుడవేగ అంజి తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనం బాల్యంలో చేసిన అల్లరిని, ఆ సమయంలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీస్ గురించి దర్శకుడు రాసుకున్న పాయింట్ చాలా ఫ్రెష్ గా ఉంది. బాల్యం గురించి, స్కూల్ లైఫ్ గురించి ఇప్పటికే బోలెడన్ని తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా ఇంచుమించు అదేలా కొనసాగుతుంది. కానీ ఈ మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని మేకర్స్ ప్రకటించారు.
కథేంటంటే..
మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన సోమయాజ్ (శ్రీరామ్) అమెరికాలో స్థిరపడి రిచ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ శ్రీరామ్ మాత్రం ఆనందంగా ఉండడు. అతడు 10వ తరగతిలో ప్రేమించిన చాందిని (అవికాగోర్) కోసం తిరిగివస్తాడు. ఈ క్రమంలో 10వ తరగతి బ్యాచుని రీయూనియన్ చేయాలని అతడు ఆశపడుతుంటాడు. మన హీరో రీయూనియన్ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? మధ్యలో హీరోయిన్ చాందినికి ఏమైందనేది మిగతా కథ..
మనసుకు హత్తుకునేలా
యధార్థ సంఘటన కావడంతో ఈ మూవీలోని కొన్ని సీన్లు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఇటువంటి స్టోరీలతో సినిమాలు చేసినపుడు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ మొదటికే మోసం వస్తుంది. దర్శక నిర్మాతలు ఒక మంచి కథను ఎంచుకున్నా కానీ దానిని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పుకోవాలి. కానీ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ్ నిర్మాత చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. నాజర్, హిమజ, అర్చన, శివబాలాజీ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
కాస్త బోర్ కలిగించే లవ్ ట్రాక్
సోమయాజ్, చాందినీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ బోర్ కొడుతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కోసం హీరో వెతికే ఎపిసోడ్ మాత్రం బాగుంటుంది.
ఊహించని క్లైమాక్స్..
ఈ మూవీ క్లైమాక్స్ ఊహించని విధంగా ఉండి.. అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఒక మంచి మూవీ చూశామనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఈ మూవీలో ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు.
బలాలు:
శ్రీనివాస్ రెడ్డి కామెడీ
కొన్ని లవ్ సీన్స్
బలహీనతలు
హీరో యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
రీ యూనియన్ సీన్లు
చివరగా.. ఈ డైరీస్ మీకు కూడా చిన్ననాటి విషయాలను గుర్తుకు తెస్తుంది..
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!