కథేంటంటే..
అందరు యువకుల మాదిరిగానే సినిమా హీరో కావాలని అర్జున్ (గల్లా అశోక్) అనే మధ్య తరగతి కుర్రాడు కలలు కంటూ ఉంటాడు. తన కలలను నిజం చేసుకునేందుకు అనేక పాట్లు పడతాడు. ఈ సందర్భంలో అతడు తన పక్కింట్లో ఉండే సుబ్బు (నిధి అగర్వాల్)ను లవ్ చేస్తాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న అర్జున్ జీవితంలోకి ఒక కొరియర్ వస్తుంది. ఆ కొరియర్‌లో మాఫియా వాళ్లు పంపించిన ఓ గన్ ఉండేసరికి అది చూసి అర్జున్ షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ వ్యక్తిని చంపమని అర్జున్‌కు మాఫియా వాళ్లు ఫొటోను కూడా పంపుతారు. అసలు అర్జున్‌కు మాఫియాకు సంబంధం ఏంటి? అని అనుమానం కలుగుతుంది. మరి అర్జున్ కు వచ్చిన ఫొటోలోని వ్యక్తిని అతడు చంపాడా, హీరోగా మారి అర్జున్ తక కలను నెరవేర్చుకున్నాడా తెలియాలంటే మాత్రం ఈ హీరో మూవీని చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే…
పెద్ద స్టార్ డమ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అశోక్. అటువంటి వ్యక్తిని హీరోగా పరిచయం చేయాలంటే మంచి కమర్షియల్ హంగులను ఉన్న కథను ఎంచుకోవాలి. శ్రీరామ్ ఆదిత్యేమో డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. మరి శ్రీరామ్ అశోక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాడా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది కానీ శ్రీరామ్ మాత్రం మరోసారి ఓ డిఫరెంట్ కథతో వచ్చి ప్రేక్షకులను మాయ చేశాడనే చెప్పొచ్చు. ఒక డెబ్యూ హీరోకు కావాల్సిన కమర్షియల్ హంగులన్నింటినీ శ్రీరామ్ ఈ హీరో సినిమాలో మేళవించాడు. ఇక అశోక్ కొత్త కుర్రాడే అయినా కానీ డ్యాన్సులు, కామెడీ డైలాగ్స్ బాగా చేశాడు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాత్రకు ఎక్కువ స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో ఈ బ్యూటీ కనువిందు చేసింది. ఇక హీరోతో వచ్చే లిప్ కిస్ సీన్‌లో తన అనుభవాన్నంతా రంగరించింది.
మెప్పించిన సీనియర్ నటులు..
ఇక ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు ఉన్నారు. వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. బ్రహ్మాజీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్, సత్య, రచ్చరవి వంటి కమెడియన్లు కూడా ఉన్నారు. వారు ఉన్నంత సేపు చాలా కామెడీ చేశారు.
మరి మిగతా అంశాలో…
సినిమాకు ప్రధాన బలం కెమెరా మెన్ పనితనం. ఒక దర్శకుడు ఎంత చక్కని సినిమా తీద్దామని అనుకున్నా కానీ కెమెరామెన్ పనితనం సరిగ్గా లేకపోతే ఆ సినిమా ప్రేక్షకులకు రుచించదు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పని చేసిన రిచర్డ్, సమీర్ రెడ్డి సినిమాకు రిచ్ లుక్ తేవడంలో తమ వంతు న్యాయం చేశారు. ఇక మిగతా అంశాలు కూడా పరవాలేదనిపిస్తాయి. ఇక జిబ్రాన్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఓవరాల్‌గా పండుగ పూట హీరో అంటూ తెరమీద సందడి చేసిన గల్లా అశోక్ బాగానే ఎంటర్ టైన్ చేశాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!