• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!

    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః” అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం…

    విజయశాంతి:

    తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్.

    “ఈ దుర్యోధన దుశ్శాసన

    దుర్వినీతలోకంలో

    రక్తాశ్రులు చిందిస్తూ

    రాస్తున్నా శోకంతో

    మరో మహాభారతం ఆరవవేదం

    మానభంగపర్వంలో

    మాతృహృదయ నిర్వేదం నిర్వేదం…

    ఆసిన్

    విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్‌ రోల్‌ నటించి మెప్పించింది.

    కమలినీ ముఖర్జీ

    హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది.

    ఇలియానా

    రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్‌ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు.

    నయనతార

    లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది.

    అనుపమ పరమేశ్వరన్

    క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్‌ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది.

    సాయి పల్లవి

    ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్‌ ఏదైన ఉందంటే  ‘ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది.

    శృతిహాసన్

    తెలుగులో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్‌. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే.

    సన్నిలియోన్

    మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్.

    షకిలా

    నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.  

    కలర్స్ స్వాతి

    సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి 

    సంయుక్త మీనన్

    ధనుష్ హీరోగా నటించిన ‘సార్’ మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్‌ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్ 

    సుహాసిని

    ఇక పాత తరంలో ‘ఆరాధన’ సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv