కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
కాలింగ్ సహస్ర
సుడిగాలి సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. సుడిగాలి సుధీర్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా నటించింది.
హాయ్ నాన్న
నానీ లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్ థాకూర్ నటించింది.
కంజూరింగ్ కన్నప్పన్
గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కంజూరింగ్ కన్నప్పన్’ ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు.
#90s
హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Bitcon | Movie | English | Netflix | Jan 01 |
Fool me once | Series | English | Netflix | Jan 01 |
You Are What You Eat: A Twin Experiment | Series | English | Netflix | Jan 01 |
Delicious in Dungeon | Series | English/Japanese | Netflix | Jan 04 |
The brothers son | Series | English | Netflix | Jan 04 |
Good grief | Movie | English | Netflix | Jan 05 |
Ishura | Series | English/Japanese | Disney HotStar | Jan 03 |
Perilloor Premier League | Series | Malayalam | Disney HotStar | Jan 05 |
Marry my husband | Series | English/Korean | Amazon Prime | Jan 01 |
LOL: Last One Laughing Quebec 2 | Series | English | Amazon Prime | Jan 05 |
Tejas | Movie | Hindi | Zee5 | Jan 05 |
Meg 2: The trench | Movie | Telugu/English | Jio Cinema | Jan 03 |
Cubicles Season 3 | Movie | Hindi | SonyLIV | Jan 05 |
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్