• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!

    ప్రతీ సంవత్సరం స్టార్‌ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్‌ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. 

    శౌర్యువ్‌

    నాని హీరోగా తెరక్కిన హాయ్‌ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు. 

    కళ్యాణ్‌ శంకర్‌

    కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

    సుమంత్ ప్రభాస్

    షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్‌ చేసిన ప్రమోషన్స్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. 

    క్లాక్స్‌

    చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. 

    వేణు యెల్దండి

    ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన ‘బలగం’ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది.

    శ్రీకాంత్ ఓదెల

    నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు. 

    షణ్ముఖ ప్రశాంత్

    ఈ ఏడాది విడుదలైన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 

    మురళి కిషోర్

    కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్‌.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv