ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. వినోదం, వికాసం, విజ్ఞానం ఇలా ప్రతీది ఫోన్లోనే దొరుకుతోంది. ఈ నేపథ్యంలో యువత గేమ్స్‌ను సైతం స్మార్ట్‌ఫోన్‌లోనే ఆడుతూ ఉల్లాసం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ఏటా వందల సంఖ్యలో మెుబైల్ గేమ్స్ ప్లే స్టోర్‌లోకి వచ్చిపడుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే గేమర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టాప్-10 ఆండ్రాయిడ్ మెుబైల్స్ గేమ్స్ ఏవో ఇప్పుడు చుద్దాం..
1. కాల్ ఆఫ్ డ్యూటీ: మెుబైల్
కాల్ ఆఫ్ డ్యూటీ ప్రస్తుతం టాప్ మెుబైల్ యాక్షన్ గేమ్‌గా దూసుకుపోతోంది. ప్లేస్టోర్‌లో అత్యంత ఆదరణ పొందిన గేమ్‌గా గుర్తింపు పొందింది. ఫుల్ ఆఫ్ యాక్షన్‌తో తయారు చేసిన ఈ గేమ్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ గేమ్‌ను 100 మిలియన్ల మందికి పైగా డౌన్లోడ్స్ చేసుకున్నారు.
2. డెడ్ సెల్
డెడ్ సెల్ కూడా ఓ యాక్షన్ అండ్ అడ్వెంచర్ గేమ్. ప్రస్తుతం ఈ గేమ్ కూడా యూత్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం అత్యధిక డౌన్‌లోడ్స్‌తో ఈ గేమ్ దూసుకుపోతోంది. యూజర్ల నుంచి రివ్యూలు, రేటింగ్ ఆధారంగా ఈ గేమ్ టాప్-2 లో నిలుస్తోంది.
3. కవర్ ఫైర్
కవర్ ఫైర్ అనేది సింగిల్ ప్లేయర్ షూటింగ్ గేమ్. ఇందులో శత్రువును అంతం చేయడానికి అనేక తుపాకులు, ఆయుధాలు ఉంటాయి. అడవులు, ఏడారుల గుండా ప్రయాణిస్తూ శత్రువును అన్వేషించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 4.7 రేటింగ్‌తో గేమ్ అలరిస్తోంది.
4. షాడో ఆఫ్ డెత్
‘షాడో ఆఫ్ డెత్’ అని పిలువబడే ఈ ఆఫ్‌లైన్ ఆండ్రాయిడ్ గేమ్‌లో రాక్షసులను అంతం చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లు తమ శత్రువును ఓడించడానికి ప్రత్యేకమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు.
సాహసోపేతమైన యాక్షన్ గేమ్ కావాలనుకునే వారికి షాడ్ ఆఫ్ డెత్ తప్పక నచ్చుతుంది. ప్రస్తుతం ఈ గేమ్ 4.8 రేటింగ్‌తో ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
5. మార్స్
అంతరిక్షానికి సంబంధించిన గేమ్ ఆడాలని కోరుకునేవారికి మార్స్ గేమ్ మంచి ఛాయిస్ అని చెప్పాలి. ఇందులో ఆటగాళ్లు మార్స్ గ్రహంపై వ్యోమగాములుగా ఉంటారు. ఈ గేమ్ ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులోని గ్రాఫిక్స్, స్టేజెస్ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మార్స్ గేమ్ 4.5 రేటింగ్‌తో బెస్ట్ గేమింగ్ ఆప్షన్‌గా ఉంది.
6. ట్రాఫిక్ రైడర్
బైక్ రేసర్‌గా ట్రాఫిక్‌లో దూసుకెళ్లాలని భావించే వారికి ట్రాఫిక్ రైడర్ గేమ్ బాగా నచ్చుతుంది. ఈ గేమ్‌లో ఆటగాళ్లు ఎదురుగా వచ్చే అడ్డంకులను తప్పించుకొని వేగంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లను అదిగమించి బైక్ రైడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులోని గ్రాఫిక్స్ గేమర్స్‌ను అలరిస్తాయి. యూజర్లు ఈ గేమ్‌కు 4.3 రేటింగ్ ఇచ్చారు.
7. పేబ్యాక్ గేమ్-2
పేబ్యాక్ గేమ్ 2.. GTA తరహా ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్ గేమ్. ఇందులో ఆటగాళ్లు నగరంలో అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. బైక్, కార్, హెలికాఫ్టర్లు నడుపుతూ బీభత్సం సృష్టిస్తారు. యాక్షన్ ప్రియులను ఈ గేమ్ తప్పక అలరిస్తుంది. ప్లేస్టోర్‌లో 4.5 రేటింగ్‌తో ఈ గేమ్ మంచి ఆదరణ సంపాదించింది.
8. అస్పాల్ట్ నిట్రో
కార్ రేసులను విపరీతంగా ఇష్టపడే వారికి అస్పాల్ట్ నిట్రో గేమ్ బాగా నచ్చుతుంది. అహ్లాదకరమైన గ్రాఫిక్స్‌తో ఆటగాళ్లు ఇందులో పోటీ పడతారు. విభిన్నమైన ప్రాంతాల్లో రేస్ నిర్వహించడం ద్వారా గేమర్స్ మంచి అనుభూతి పొందుతారు.
9. స్టిక్ క్రికెట్ ప్రీమియర్ లీగ్
క్రికెట్ ప్రియులకు ఈ గేమ్ నచ్చుతుంది. ఐపీఎల్‌ను అధికంగా ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్‌ను రూపొందించారు. ఇందులో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులపెట్టించాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు యూజర్లు 4.4 రేటింగ్ ఇచ్చారు.
10. షాడో ఫైట్ 3
యాక్షన్ ప్రియుల కోసం ప్రత్యేకించి షాడో ఫైట్ 3 గేమ్‌ను రూపొందించారు. ఈ గేమ్‌లో ఒక పాత్రను ఎంచుకొని శత్రువుపై దాడి చేయాల్సి ఉంటుంది. పవర్ఫుల్ ఆయుధాలతో విరుచుకుపడుతూ ప్రత్యర్థిని ఓడించాల్సి ఉంటుంది. ఇందులోని గ్రాఫిక్స్ ఆటగాళ్లను తప్పక ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ గేమ్ కూడా 4.5 రేటింగ్‌తో ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది