• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Latest OTT releases Telugu: ఈ వారం మీకు తప్పక వినోదాన్ని పంచే కొత్త చిత్రాలు ఇవే!

    వీకెండ్‌లో కొత్త చిత్రాలను చూడాలని భావించేవారికి ఈ వారం కూడా మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీకు వినోదాన్ని పంచేందుకు పలు నయా చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్‌ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    రాజు యాదవ్‌

    హాస్య నటుడు గెటప్‌ శ్రీను (Getup Srinu) హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju Yadav). అంకిత కారాట్‌ హీరోయిన్‌. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమా మేలో థియేటర్లలో సందడి చేసింది. జులై 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహా (Aha) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘రాజు యాదవ్‌ ముఖానికి క్రికెట్‌ బాల్‌ తగలడంతో ఆపరేషన్‌ చేస్తారు. అది ఫెయిల్‌ కావడంతో ఫేస్‌ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ అనే యువతిని ప్రేమించి ఆమెతో పాటు హైదరాబాద్‌ వెళ్తాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా మారతాడు. ఈ క్రమంలో స్వీటీ మరొకరిని ప్రేమించి మోసం చేస్తుంది. ఆమెను మరిచిపోలేక రాజు యాదవ్‌ ఏం చేశాడు? అతడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది స్టోరీ. 

    యేవమ్‌

    చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలో ప్రకాష్‌ దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘యేవమ్‌’ (Yevam). ఈ సినిమా థ్రిల్లర్ కథాంశంతో 2024 జూన్‌ 14న థియేటర్లలో విడుదలైంది.  తాజాగా జులై 25 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘వికారాబాద్‌ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో ఎస్సై సౌమ్య (చాందినీ చౌదరీ)కు పోస్టింగ్‌ వస్తుంది. అదే స్టేషన్‌లో పనిచేసే మరో ఎస్సై అభిరామ్‌కు దగ్గరవుతుంది. అయితే అభిరామ్‌కు గతంలోనే హారికతో పెళ్లి జరుగుతుంది. మరోవైపు ఓ యుగంధర్‌ అనే సైకో ప్రభాస్‌ పేరు వాడుకొని అమ్మాయిలను ట్రాప్‌ చేసి హత్యలు చేస్తుంటాడు. హారికకు ఆ సైకోకు సంబంధం ఏంటి?  సౌమ్య ఇన్‌వెస్టిగేషన్‌లో బయటపడిన షాకింగ్‌ నిజాలు ఏంటి? అన్నది స్టోరీ. 

    భయ్యా జీ

    మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో అపూర్వ సింగ్‌ కర్కి (Apoorv Singh Karki) దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘భయ్యా జీ’ (Bhaiyya Ji). మనోజ్‌ బాజ్‌ పాయ్‌కి ఇది 100వ సినిమా. మేలో థియేటర్లలో విడుదలైంది. జులై 26 నుంచి ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఈ చిత్రం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‌ కానుంది. తాను అమితంగా ప్రేమించే వారిని దూరం చేసే వ్యక్తులపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేదే ఈ సినిమా స్టోరీ.

    బ్లడీ ఇష్క్‌

    అవికా గోర్‌ (Avika Gor), వర్ధన్‌ పూరి ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘బ్లడీ ఇష్క్‌’ (Bloody Ishq). విక్రమ్‌ భట్‌ రూపొందించిన ఈ మూవీ నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో జులై 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్లాట్ ఏంటంటే ‘ఐల్యాండ్‍పై ఉండే ఓ భవనంలో ఉండేందుకు అవికా, వర్దన్ వెళతారు. ఈ భవనంలో అవికకు దెయ్యం ఉందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? అవికాను ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? దాని బారి నుంచి ఆమె బయటపడింది? అన్నది స్టోరీ. 

    శాఖాహారి

    రంగాయ‌న ర‌ఘు, గోపాల‌కృష్ణ దేశ్‌పాండే, విన‌య్‌యూజే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన క‌న్న‌డ మూవీ ‘శాఖాహారి’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై 25 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘సుబ్బన్న ఓ టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుంటాడు. ఓ రోజు విజయ్‌ అనే ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకొని గాయాలతో సుబ్బన్న దగ్గరకు వస్తాడు. అతడి వద్ద ఆశ్రయం పొందుతూ చనిపోతాడు. మరోవైపు అతడ్ని వెతుక్కుంటా ఎస్సై మల్లిఖార్జున వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? శవాన్ని కనిపించకుండా సుబ్బన్న ఏం చేశాడు? అసలు విజయ్‌కు జరిగిన అన్యాయం ఏంటీ? సుబ్బన్న ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.

    భరత నాట్యం

    సూర్యతేజ, మీనాక్షి, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భరతనాట్యం‘. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి దొరసాని ఫేమ్‌ డైరెక్టర్‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. జులై 27నుంచి ఆహా వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్లాట్‌ ఏంటంటే ‘రాజు సుందరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆర్థిక సమస్యల వల్ల డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని భావిస్తాడు. ఓ ముఠా నుంచి పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. దీంతో ఆ ముఠా నుంచి రాజుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడు డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.

    ది గోట్‌ లైఫ్‌ 

    స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం గతవారం (జూలై 19) స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం అవుతోంది. గత వీకెండ్‌ మిస్‌ అయ్యి ఉంటే ఈ వీకెండ్‌ తప్పక చూడండి. ప్లాట్‌ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్ ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ

    హరోం హర 

    సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘హరోం హర‘ చిత్రం జూన్‌ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే ఈ చిత్రం గతవారమే ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమా ఇప్పటివరకూ చూడకుంటే ఈ వారం చూసేయండి. ప్లాట్‌ ఏంటంటే ‘కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?’ అన్నది కథ.

    మ్యూజిక్‌ షాప్‌ మూర్తి

    అజయ్‌ ఘోష్‌ (Ajay ghosh) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్‌ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ కూడా గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే ‘మూర్తి (అజయ్‌ ఘోష్‌) 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్‌ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv