• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Veekshanam Review: హత్యలు చేస్తోన్న యువతి 8 నెలల క్రితమే చనిపోతే.. ‘వీక్షణం’ ఎలా ఉందంటే?

    నటీనటులు : రామ్‌ కార్తిక్‌, షైనింగ్‌ కశ్వి, నక్షత్ర నైనా, చిత్రం శ్రీను, దయానంద్‌ రెడ్డి, గాంధీ సమ్మెట, నాగ మహేష్‌, షైనింగ్‌ ఫణి తదితరులు

    డైరెక్టర్‌ : మనోజ్‌ పల్లేటి

    సంగీతం : సమర్థ్‌ గొల్లపూడి

    సినిమాటోగ్రఫీ : సాయిరామ్ ఉదయ్‌

    ఎడిటర్‌: జస్విన్‌ ప్రభు

    నిర్మాతలు : పద్మనాభరెడ్డి, అశోక్‌ రెడ్డి

    విడుదల తేదీ: 18-10-2024

    రామ్ కార్తీక్ (Ram Karthik), క‌శ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకుడు. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. అక్టోబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం. 

    కథేంటి

    హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు తన చుట్టు పక్కల వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. తన దగ్గరున్న బైనాకులర్స్‌తో అందరి ప్లాట్లలోకి చూస్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో ఉన్న నేహా (కశ్వి)ని చూసి ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అర్విన్ తన ఫోకస్ మరో ఇంటిపై పెడతాడు. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఆమె ఇంటికి రోజు ఎవరో వస్తూ పోతుంటారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకునేందుకు ఇంటికి వెళితే అనూహ్యంగా ఆ యువతి చనిపోయి కనిపిస్తుంది. చనిపోయి కూడా ఎనిమిది నెలలు అవుతుంటుంది. మరి అర్విన్‌ రోజూ చూసిన యువతి ఎవరు? ఆమె ఇంటికి రోజు వచ్చేది ఎవరు? మరి ఆమెది ఆత్మహత్య? హత్యనా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    రామ్ కార్తిక్ ఒక సగటు కుర్రాడు పాత్రలో ఇమిడిపోయాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ మెప్పించాడు. హీరోయిన్‌గా చేసిన కశ్వి తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టిసేంది. హీరోయిన్‌గా తొలిసినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అంద చందాలు ఒలకబోసింది. మరో కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి కూడా ఆకట్టుకుంది. తక్కువ నిడివి ఉన్నప్పటికీ ఆమె పాత్ర కథపై పెద్ద ప్రభావాన్నే చూపింది. సమ్మెట గాంధీ, చిత్రం శీను, నాగమహేష్ వంటి వాళ్లు కనిపించింది కొద్దిసేపైనా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దేశంలో చాలా మంది తన పని కన్నా పక్కవారు చేస్తున్న దానిపై ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపిస్తుంటారు. దర్శకుడు మనోజ్‌ పల్లేటి ఈ కాన్సెప్ట్‌తోనే సినిమాను రూపొందించడం ప్రశంసనీయం. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించాడు డైరెక్టర్. చివరవరకు అదే టెంపోను కంటిన్యూ చేసి సక్సెస్‌ అయ్యాడు. తన కళ్లముందు వరుసగా హత్యలు జరగడం, చేస్తుందనుకున్న అమ్మాయి 8 నెలలు క్రితమే చనిపోయి ఉండటం హీరోతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ తెప్పించినా మెయిన్ స్టోరీపై ఇంట్రెస్ట్ తగ్గకుండా డైరెక్టర్‌ జాగ్రత్తపడ్డారు. ఇక క్లైమాక్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చే రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుడు మనోజ్ పల్లేటి తొలి చిత్రంతోనే తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నాడు.

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాలకు వస్తే సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి అదరగొట్టాడు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేశాడు. సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • రామ్ కార్తీక్ నటన
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • అక్కడక్కడా బోరింగ్‌ సీన్స్‌
    • ఎడిటింగ్‌

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv