పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్ కల్యాణ్ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
అకీరానందన్ 2004 ఏప్రిల్ 8న పవన్ – రేణు దేశాయ్ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.
అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్, రానా, వరుణ్ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.
అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.
అకీరా నందన్ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదట. యంగ్ హీరో అడివి శేష్ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్ గతంలో వెల్లడించింది.
ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు.
అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.
ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్ కల్యాణే చూసుకుంటున్నారు.
తన తల్లికి పవన్ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్ అకీరాలో రాకుండా రేణు దేశాయ్ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట.
అకీరానందన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.
ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.