ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) విశ్వ సుందరిగా గుర్తింపు సంపాదించింది. హీరోయిన్గా ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో చాలా మందికి ఆమె కలల రాకుమారి. ఈ క్రమంలోనే సడెన్‌గా అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)ను వివాహామాడి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఐశ్వర్య అందానికి అభిషేక్ తగడంటూ బహిరంగంగానే అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా ఈ జంట కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. ఓ నటి కారణంగా వీరి మధ్య గ్యాప్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.
త్వరలో విడాకులు?
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ఇదిలా ఉంటే ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికార్లు చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ (Nimrat Kaur)తో అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆమె కారణంగా వారి మధ్య దూరం కూడా పెరిగిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి త్వరలోనే నిమ్రత్‌ను పెళ్లి చేసుకోనే ఆలోచనలో అభిషేక్ ఉన్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలను ఖండిస్తూ ఐశ్వర్య-అభిషేక్ ఒక్క ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
దూరం పెట్టిన ఐశ్వర్య!
గత కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా కేవలం తన కూతురితోనే కనిపిస్తోంది. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు సైతం ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్ వారితో లేకపోవడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. రీసెంట్గా ఐశ్వర్య రాయ్ తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడిపారు. కూతురు ఆరాధ్యతో కలిసి కజిన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు. ఈ ఫ్యామిలీ ఈవెంట్‌కు సైతం అభిషేక్ హాజరుకాలేదు. విడాకుల రూమర్స్ మెుదలైనప్పటి నుంచి ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ జంటగా కనిపించకపోవడంతో ఐశ్వర్య కూడా అభిషేక్‌ను దూరం పెడుతోందన్న వార్తలు బలపడుతున్నాయి.
ఏకీపారేస్తున్న నెటిజన్లు!
అభిషేక్‌తో విడాకుల అంశంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున ఐశ్వర్యరాయ్‌కు అండగా నిలుస్తున్నారు. అభిషేక్ తనకు కరెక్ట్ కాదని తొలి నుంచి తాము చెబుతూనే వస్తున్నామని గుర్తుచేస్తున్నారు. గోల్డ్ (నిమ్రత్ కౌర్)ను వెతుక్కునే ప్రయత్నంలో డైమండ్ (ఐశ్వర్యరాయ్)ను కోల్పోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఫ్యాన్స్ సైతం ఈ వ్యవహారంలో ఐశ్వర్యకు అండగా నిలుస్తున్నారు. గతంలో ఐశ్వర్య – సల్మాన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆమె సల్మాన్‌కు బ్రేకప్ చెప్పి అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాంగ్ ఛాయిస్ అంటూ సల్మాన్ ఫ్యాన్స్ ఐశ్వర్యను ట్రెండ్ చేస్తున్నారు. ఐశ్వర్య కంటే నిమ్రత్ పెద్ద గ్లామరస్ కూడా కాదమని కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరీ నిమ్రత్ కౌర్?
నిమ్రత్ గౌర్ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. హిందీలో 10 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్‌గానే ఉంటోంది. గతేడాది ‘స్కూల్ ఆఫ్ లైస్’ వెబ్‌సిరీస్‌లోనూ ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. అభిషేక్ నటించిన ‘దస్వి’ (2022) చిత్రంలో ఆమె హీరోయిన్గా చేసింది. షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఉండగా ఇటీవల అది ప్రేమగా మారి పెళ్లి వరకూ దారితీసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్‌తో ‘సెక్షన్ 84’ చిత్రం సైతం నిమ్రత్ కౌర్ చేస్తోంది. దీంతో అమితాబ్‌కు కూడా ఆమెపై పాజిటివ్ ఓపినియన్ ఏర్పడిందన్న అభిప్రాయం కూడా బాలీవుడ్ వర్గాల్లో ఉంది.