ఒకప్పుడు వీకెండ్ అనగానే తెలుగు ప్రేక్షకుల చూపు థియేటర్ల వైపు మళ్లేది. ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / సిరీస్‌లు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ (OTT Suggestions) కంటెంట్ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్ అని చెప్పవచ్చు. థియేటర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి స్టోరీ లైన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
దేవర (Devara)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర (OTT Suggestions) మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ సుమారు 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (నవంబర్ 8) నుంచి స్ట్రీమింగ్‌కు కానుంది. ప్లాట్ ఏంటంటే ‘సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు?’ అన్నది స్టోరీ.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన తమిళ హిట్ మూవీ ‘వేట్టయన్’ (OTT Suggestions) కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సినిమాలో రజనీ, అమితాబ్‌తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు. ప్లాట్ ఏంటంటే ‘ఎస్పీ అదియన్ (రజనీకాంత్) స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదుతో గంజాయి మాఫియాను అణిచివేస్తాడు. ఈ క్రమంలో చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయిన శరణ్య అనూహ్యంగా అక్కడ హత్యాచారానికి గురవుతుంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు మెుదలవడంతో ఈ కేసును అదియన్‌కు ప్రభుత్వం అప్పగిస్తుంది. అసలు శరణ్య హత్యకు కారణం ఏంటి? దాని వెనక ఉన్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? శరణ్యకు అదియన్ ఎలా న్యాయం చేశాడు?’ అన్నది స్టోరీ.
ఏఆర్ఎం (ARM)
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏఆర్‌ఎం’ (ARM). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ మూవీ నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (OTT Suggestions)లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ప్లాట్ ఏంటంటే ‘అజయ్ (టొవినో థామస్) ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం బంగారం కంటే విలువైంది. దాన్ని కొట్టేసి ఆ నిందని అజయ్‌పై వేయాలని సుదేవ్‌వర్మ కుట్ర చేస్తాడు. అయితే విగ్రహాన్ని అజయ్ ఫ్యామిలీ తరతరాలుగా రక్షిస్తుంటుంది. మరి ఈసారి అజయ్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్రహం చరిత్ర ఏంటి? కథలో మహావీరుడు కుంజికేలు, మణియన్ ఎవరు?’ అన్నది స్టోరీ.
సిటడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)
సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ‘. ఈ సిరీస్ ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ వేదికగా నవంబర్ 7 నుంచి స్టీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. సీక్రెట్ ఏజెంట్‌గాను పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో పరిచయమైన హనీ (సమంత)ను ఓ మిషన్‌లో భాగం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. అయితే ఈ మిషన్‌లో హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. కానీ, 8 ఏళ్ల తర్వాత హనీ బతికున్న విషయం తెలుస్తుంది. వారిద్దరికి పుట్టిన కూతురు కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు యత్నిస్తుంటారు. అప్పుడు బన్నీ ఏం చేశారు? విలన్ గ్యాంగ్‌ను హనీ-బన్నీ ఎలా ఎదుర్కొన్నారు? విలన్ గ్యాంగ్ హనీ వెంట ఎందుకు పడుతోంది?’ అన్నది స్టోరీ.
జనక అయితే గనక (Janaka Aithe Ganaka)
యంగ్ హీరో సుహాస్ (Suhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక‘ (OTT Suggestions). సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. సంగీర్తన విపిన్ హీరోయిన్. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 12 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నవంబర్ 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్లాట్ ఏంటంటే ‘మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) బెస్ట్ ఇవ్వలేనని భావించి పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ఈ క్రమంలో అనూహ్యంగా భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై ప్రసాద్ కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగింది? తండ్రయ్యాక ప్రసాద్‌లో వచ్చిన మార్పు ఏంటి? ఇంతకీ కేసు గెలిచాడా? లేదా?’ అన్నది స్టోరీ.
ది బకింగ్ హామ్ మర్డర్స్ (The Buckingham Murders)
కరీనా కపూర్ (Kareena Kapoor) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పించే ఉద్దేశ్యంతో ఈ వారం స్ట్రీమింగ్ వస్తోంది. నవంబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే ‘తన కొడుకును కోల్పోయిన డిటెక్టివ్ జస్మిత్, బాధను మరిచిపోవడం కోసం వేరే ఊరు వెళుతుంది. అక్కడ ఓ పదేళ్ల పిల్లాడి కిడ్నాప్ కేసును ఆమె ఛేదించవలసి వస్తుంది. ఆ పిల్లాడు హత్య చేయబడ్డాడని తెలుసుకుని ఆ దిశగా తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. అప్పుడు ఆమెకి తెలిసిన షాకింగ్ నిజాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
విజయ్ 69 (Vijay 69)
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) లీడ్ రోల్ చేసిన సినిమా ‘విజయ్ 69’. నవంబరు 8 నుంచి నేరుగా నెట్‌ఫ్లిక్స్ (OTT Suggestions)లో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్ ఏంటంటే ’69 ఏళ్ల విజయ్ ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇందుకోసం అతడు 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్‌ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరూ అతడ్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. అప్పుడు విజయ్ ఏం చేశాడు? కలలకు వయసుతో సంబంధం లేదని ఎలా నిరూపించాడు? అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..