అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా రెండు పాటలు, ఓ సీన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో అనౌన్స్ చేసిన టైమ్‌కు పుష్ప 2 వస్తుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప మేకింగ్‌కు సంబంధించి ఊహించని ట్విస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాథ్యతలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్!
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీని పెట్టుకొని థమన్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడం చర్చలు తావిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సుకుమార్ అసంతృప్తి!
సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి ర్యాపో ఉంది. సుకుమార్ ఇప్పటివరకూ తెరకెక్కించిన అన్ని చిత్రాలకు దేవిశ్రీనే సంగీతం సమకూర్చారు. అంతేకాదు ఆయా చిత్రాల ఆల్బమ్స్ సూపర్ డూపర్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ‘పుష్ప 2’ బాధ్యతలు సైతం దేవిశ్రీకి సుకుమార్ అందించారు. పుష్ప 2 పాటల విషయంలో సంతృప్తి చెందిన సుకుమార్ నేపథ్యం సంగీతం విషయంలో మాత్రం అసంతప్తిగా ఉన్నారట. సినిమా రిలీజ్‌కు 29 రోజుల సమయంలో మిగిలి ఉండటం, దేవిశ్రీకి ఇంకా చేతినిండా పని ఉండటంతో థమన్ చేత బీజీఎం ఇప్పించాలని సుకుమార్ నిర్ణయించారట. ఇందుకోసం థమన్‌తో చర్చలు సైతం జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. థమన్ కూడా కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌ను సుకుమార్‌కు వినిపించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
థమన్‌కే ఎందుకు!
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman)కు మంచి పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందిస్తాడని పేరుంది. ఇటీవల కాలంలో థమన్ పాటల కన్నా బీజీఎంతోనే ఎక్కువగా అల్లాడిస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘వకీల్‌సాబ్’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘బ్రో’ ‘స్కంద’ వంటి చిత్రాలకు థమన్ ఏ స్థాయి బీజీఎం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎంతో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా థమన్‌నే ఏరికోరి సుకుమార్ బీజీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు థమన్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశాడు. ‘సరైనోడు’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. బన్నీకి ఎలాంటి మ్యూజిక్ ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లుతాయో థమన్‌కు ఇప్పటికే ఓ ఐడియా ఉంది. కాబట్టి ‘పుష్ప 2’కు థమన్ నేపథ్య సంగీతం అందించినా అది కచ్చితంగా అదిరిపోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
తెరపైకి మరో మ్యూజిక్ డైరెక్టర్!
థమన్‌తో పాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘కాంతార’, ‘మంగళవారం’ లాంటి సినిమాలకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath)ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సమయం లేనందున థమన్‌కు తొలిభాగం, అజనీష్‌కు సెకండ్ పార్ట్ బాధ్యతలు అప్పగిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ‘పుష్ప 2’ చిత్రానికి ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు పనిచేయనున్నారు. అయితే థమన్ ఒక్కరే నేపథ్యం సంగీతం అందిస్తారని ఇండస్ట్రీ వర్గాలు స్ట్రాంగ్‌గా చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకూ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
‘పుష్ప 2’ అరుదైన ఘనత
పుష్ప (Pushpa 2) కి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్లోనూ పుష్ప’ (2021) సక్సెస్ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్లో ప్రీసేల్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది.