మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్ మీట్స్ నిర్వహించిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు విష్ణు తన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.
విష్ణు.. మాస్ వార్నింగ్
మంచు ఫ్యామిలీ గొడవల్లో బయటవారి ప్రమేయం ఉందని మంచు విష్ణు అన్నారు. వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. వారంతట వారే ఇందులో నుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని విష్ణు అన్నారు. అయితే తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు.
మోహన్‌బాబుకు ఊరట
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది.
దాడి కేసులో ఒకరి అరెస్టు
మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచు మనోజ్‌పై దాడి చేసిన వారిలో కిరణ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు విష్ణుకు ప్రధాన అనుచరుడిగానూ వ్యవహరిస్తున్నారు. కిరణ్‌తో పాటు దాడికి పాల్పడిన వినయ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
మంచు లక్ష్మి ఆసక్తిక పోస్టు
మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను పోస్టు చేస్తూ ‘పీస్’ (శాంతి) అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల రిత్యా ఆమె షేర్ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ ఇంట్రస్టింగ్ పోస్టును మంచు లక్ష్మి పోస్టు చేశారు. ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’