• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhuma Mounika: మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!

    మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు సోషల్‌ మీడియా, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా సైతం మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదాన్ని హైలేట్‌ చేస్తున్నాయి. అయితే చిన్న కోడలు, మంచు మనోజ్‌ భార్య భూమా మౌనిక (Bhuma Mounika) ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే చిన్న కోడలు మౌనికకు టీడీపీ (Telugu Desam Party) బ్యాక్‌గ్రౌండ్‌ ఉండటంతో ఆ పార్టీ నేతలు ఈ వ్యవహరంలో తలదూర్చబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పెద్ద కోడలు విరానిక రెడ్డి (Viranica Reddy)కి వైసీపీ (YSRCP Party) బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కారణంగా మంచు ఫ్యామిలీ వివాదం పొలిటికల్‌ టర్న్‌ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    చిన్న కోడలికి టీడీపీతో సత్సంబంధాలు

    మంచు మోహన్‌ బాబు (Manchu Mohan Babu) రెండో కుమారుడు మనోజ్.. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక (Bhuma Mounika)ను గతేడాది మార్చిలో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనికది ఆళ్లగడ్డలో బలమైన రాజకీయ నేపథ్యమున్న ఫ్యాక్షన్‌ ఫ్యామిలీగా చెబుతుంటారు. మౌనిక తల్లి భూమా శోభా నాగిరెడ్డి (Bhuma Shobha Nagi Reddy) నాలుగు పర్యాయాలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా చేశారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి (Bhuma Nagi Reddy) కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి మరణానంతరం సోదరి భూమా అఖిల ప్రియా (Bhuma Akhila Priya) టీడీపీ తరుపున రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తండ్రితో మంచు మనోజ్‌ వివాదం నేపథ్యంలో మరిదికి అండగా పలువురిని ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ పంపినట్లు కథనాలు వచ్చాయి. 

    పెద్ద కోడలికి జగన్‌తో బంధుత్వం 

    మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu)కి వైకాపా అధినేత జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy)తో దగ్గరి బంధుత్వం ఉంది. జగన్‌, భారతీ దంపతులకు విష్ణు చాలా ఆత్మీయుడు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasekhar Reddy) సోదరుడు సుధీకర్‌ రెడ్డి కుమార్తె విరానిక రెడ్డి (Viranica Reddy)ని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. దీంతో వైఎస్‌ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి బలమైన బంధం ఏర్పడింది. వైయస్‌ కుటుంబంలో జరిగే ఫంక్షన్స్‌కు విష్ణు తప్పక హాజరవుతుంటారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వూలలో సైతం స్పష్టం చేశాడు. ఈ కారణం చేతనే విష్ణుతో పాటు అతడి తండ్రి మోహన్‌ బాబు వైసీపీతో చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనించవచ్చు. 

    టీడీపీ, వైకాపా జోక్యం తప్పదా!

    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతుండటంతో రాజకీయ జోక్యం తప్పక జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని రెండు బలమైన పార్టీలకు చెందిన కోడళ్లు మంచు ఫ్యామిలో ఉండటంతో టీడీపీ, వైకాపా పార్టీలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు మంచు మనోజ్‌ పక్కన అండగా నిలబడినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారంటూ మనోజ్‌తో పాటు మోహన్‌బాబు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ సమస్యను మోహన్‌బాబు ఫ్యామిలీ, పోలీసులు పరిష్కరించుకోలేక పోతే టీడీపీ, వైకాపా నేతల ప్రమేయం అనివార్యమవుతుందని టాక్‌ వినిపిస్తోంది. అదే జరిగితే ఒక ఫ్యామిలీకి చెందిన సమస్య కాస్త రెండు పార్టీల మధ్య గొడవగా మారే అవకాశముంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv