• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Manchu Manoj: గేట్లు బద్దలు కొట్టుకుని దూసుకెళ్లిన మనోజ్.. వీడియో వైరల్

    టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా  మోహన్‌బాబు ఇంటి గేట్లు మూసేశారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా తన అనుచరులతో కలిసి గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లారు. దీంతో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

    మంచు మోహన్ బాబు కుటుంబ విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. జల్‌పల్లిలోని నివాసం నుంచి తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను బయటకు పంపించాలనే నిర్ణయాన్ని మోహన్ బాబు తీసుకున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న సమస్యలు ఈ పరిణామానికి దారితీశాయి. మనోజ్ తన ఇంట్లో ఇక ఉండటానికి వీలులేదని మోహన్ బాబు స్పష్టంగా ప్రకటించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో మనోజ్ తన సామాన్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూడు పెద్ద వాహనాలను ఏర్పాటు చేసి, తన వ్యక్తిగత వస్తువుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఘర్షణలు తీవ్రతకు చేరుకోవడంతో మనోజ్ ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈక్రమంలోనే.. విష్ణు బౌన్సర్లు కవ్వించడంతో మనోజ్ తిరగబడ్డాడు. గేట్లు తెరవండి అంటూ తన అనుచరులతో కలిసి గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లాడు. దీంతో మోహన్‌ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  ఇరువర్గాలను సముదాయించడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

    పోలీసుల బందోబస్తు

    ఇంటిలో అనవసర గొడవలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు జల్‌పల్లి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో మనోజ్ తన సామగ్రిని ఇంటి బయటకు తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇటీవల, భద్రత కల్పించాల్సిందిగా డీజీ ఇంటెలిజెన్స్‌కు మనోజ్ విజ్ఞప్తి చేశారు.

    ఇటువంటి పరిస్థితుల్లో, బౌన్సర్ల వివాదం కూడా మరింత చర్చనీయాంశమైంది. విష్ణు బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించడంతో, మనోజ్ తన భద్రత కోసం పోలీసులపై ఆధారపడ్డారు.

    గన్‌మెన్‌ల కోసం మనోజ్ రిక్వెస్ట్

    తన తండ్రి మోహన్‌బాబుతో వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్‌లోని ఇంటిలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సంబంధిత అధికారికి తెలియజేశారు. తమ ఇద్దరికీ గన్‌మెన్లను కేటాయించాలని మనోజ్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసు అధికారి అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. 

    Screengrab Instagram: manojkmanchu

    మంచు విష్ణు వార్నింగ్‌..

    దుబాయి నుంచి వచ్చిన మంచు విష్ణు వివాదానికి కేంద్రమైన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజ్‌ తరపున వచ్చిన బౌన్సర్లకు విష్ణు వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ బౌన్సర్‌కు వేలు చూపిస్తూ మంచు విష్ణు సీరియస్‌గా మాట్లాడటం గమనించవచ్చు. 

    ఫామ్‌ హౌస్ చుట్టే లొల్లి..

    మోహన్‌ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్‌ సంస్థల ఆస్తుల పంపకాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి కారణంగానే తండ్రి కొడుకుల మధ్య గొడవ మెుదలైనట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగినప్పటికీ కూడా తనకు సంబంధంలేని జల్‌పల్లి ఇంట్లో మంచు మనోజ్ ఉండటంతో మోహన్‌బాబు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. తమ కుమారుడు మనోజ్‌, కోడలు మౌనిక తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని హైదరాబాద్‌ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

    కుటుంబ విభేదాల ప్రభావం

    ఇప్పటివరకు ఐక్యంగా కనిపించిన మంచు కుటుంబం, ఇప్పుడు విభజన దిశగా సాగుతోందని భావిస్తున్నారు. కుటుంబ ఘర్షణల కారణంగా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు మరింత క్షీణించాయి.

    ఈ పరిణామం మంచు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను మరింత వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్‌లో ఈ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో వేచిచూడాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv