సందేశాత్మక చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించిన శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు నటించిన భళా తందనాన సినిమా కలెక్షన్లను రాబట్టలేక పోయింది. దీంతో మరోసారి యాక్షన్ మూవీనే నమ్ముకుని మనముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. శ్రీవిష్ణు నటించిన ‘అల్లూరి’ శుక్రవారం(Sep23) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో.. మూవీపై కాస్త హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో విష్ణు బాక్సాఫీస్ హిట్ సాధించాడా? తన ప్లాన్ వర్కవుట్ అయిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి?
రామరాజు(శ్రీవిష్ణు) నిబద్ధత గల పోలీసాఫీసర్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తాడు. ఎంతోమంది ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు. ఇలా 20ఏళ్ల సర్వీసులో చాలా చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ క్రమంలో శ్రీవిష్ణు ఓ క్రూరమైన రాజకీయ నాయకుడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. తన కమిట్మెంట్తో సమస్యలను కోరి తెచ్చుకుంటాడు. దీంతో అతడి జీవితం తలకిందులవుతుంది. ఆ తర్వాత ఈ ఆపద నుంచి ఎలా బయటపడ్డాడు. తన ప్రస్థానంలో అల్లూరి ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వంటి అంశాలు తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారు..?
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు బాగా నటించారు. సినిమా కోసం పాత్రకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. చాలా ఫిట్‌గా కనిపించారు. మాస్ పర్ఫార్మెన్స్తో ఆడియెన్స్‌ని మెప్పించారు. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కయదు లోహర్ పరిధి మేరకు నటించింది. తనికెళ్ల భరణి, సుమన్, పృథ్వీరాజ్ తమ పరిధి మేరకు నటించారు. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా..
పోలీస్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాలకు మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ఈ సినిమాలో అదే లోపించింది. దర్శకుడు ప్రదీప్ వర్మ ఆసక్తికరమైన కథనం అందించడంలో సఫలం కాలేకపోయారు. డైలాగులు ఫర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంటే బాగుండనిపించింది. ఇక తన కెమెరాకు సినిమాటోగ్రఫర్ రాజ్ తోట.. ఇంకాస్త పనిచెబితే బాగుండేది.
బలాలు
శ్రీవిష్ణు నటన
కొన్ని సన్నివేశాలు
బలహీనతలు
స్క్రీన్ ప్లే
సంగీతం
రొటీన్ కథ
ఫైనల్‌గా.. శ్రీవిష్ణు అభిమానులను ‘అల్లూరి’ అలరిస్తాడు.
రేటింగ్: 2.5/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేసింది!