• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘భోళా శంకర్‌’ సెట్‌కు చిరుకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

    [VIDEO](url): ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌ హిట్ జోరులో ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి.. అదే ఉత్సాహంతో ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ మొదలుపెట్టారు. తమిళ సినిమా వేదాలం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. షూటింగ్‌ స్పాట్‌లో చిరుకు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తోంది. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా..మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. A MASSive … Read more

    వారి వల్లే ఇండస్ట్రీలో ఉన్నాను: రష్మిక మందన్న

    ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య కాంతార సినిమా విషయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఈ సుందరి ఇప్పుడు వారి మనసులు చల్లబడేలా మాట్లాడింది. ‘ఇప్పుడు ఇన్ని సినిమాల్లో నటిస్తుండటం ఆనందంగా ఉంది. కానీ నాకు ఇండస్ట్రీలోకి అడుగులు వేసేలా చేసింది రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి. నాలోని నటిని గుర్తించి తొలి అవకాశం ఇచ్చారు.’ అంటూ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించింది. Courtesy Instagram:rashmika_mandanna Courtesy … Read more

    వృద్ధుడిని స్కూటీతో లాక్కెళ్లిన యువకుడు

    [VIDEO](url): బెంగళూరులో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు తన స్కూటీతో 71 ఏళ్ల వృద్ధుడి కారును ఢీకొట్టడమే గాక, అక్కడి నుంచి తప్పించుకునేందుకు వృద్ధుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధుడి కారును ఢీకొట్టిన వెంటనే ఆయన అందులోంచి దిగి స్కూటి వెనకభాగాన్ని పట్టుకున్నారు. యువకుడు అలాగే లాక్కెళ్లిపోయాడు. నిందితుడు సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు. #Horrible incident in #Bengaluru: A scooterist rides on … Read more

    విరుచుకుపడిన వంశీ పైడిపల్లి

    [VIDEO](url): ‘వారిసు’ సినిమాను సీరియల్‌తో పోలుస్తూ వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి తీవ్రంగా స్పందించారు. ‘ నేనొక కమర్షియల్‌ సినిమాను తీశాను బ్రదర్‌. అయినా సీరియల్స్‌ను ఎందుకు తక్కువ చేస్తున్నారు. అది కూడా క్రియేటివ్‌ జాబ్‌. రోజూ ఎంతమంది సీరియల్స్‌ చూస్తారో సాయత్రం ఇంటికి వెళ్లి చూడండి తెలుస్తుంది. ఒకరిని కిందికి లాగాలని చూస్తున్నావంటే..నువ్‌ కిందనే ఉన్నావని అర్థం’ అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. "படம் எடுக்குறது ஒண்ணும் ஜோக் கிடையாது!" – விமர்சனங்களுக்கு இயக்குநர் … Read more

    బండి సంజయ్‌ కుమారుడి రౌడీయిజం

    [VIDEO](url): బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తాను చదివే కళాశాలలో ఓ విద్యార్థిపై అతడు దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌ కుమారుడిపై కేసు నమోదు చేశారు. మహీంద్రా యూనివర్సిటీలో ఘటన చోటు చేసుకుంది. చంపుతానంటూ విద్యార్థిని బెదిరించడం వీడియోలో కనిపిస్తోంది. Bandi Sanjay’s son is very Violent !This is Unlawful pic.twitter.com/Nv9Bcn3X6H — Krishank (@Krishank_BRS) January 17, 2023

    సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు

    [VIDEO](url):సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ మధ్యనే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చింది కాబట్టి సాధారణంగానే ఈ ట్రైన్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే ఉత్సుకతతో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం వందేభారత్‌ ఎక్కాడు. ఇంతలో ఆటోమేటిగ్‌గా రైలు డోర్‌ మూసుకుపోయింది. TTE వచ్చి ఏంటని అడగ్గా.. సార్ కొత్త ట్రైన్‌ అని సెల్ఫీ కోసం ఎక్కాను దిగేస్తాను సార్‌ అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ దిగడం కుదరదు విజయవాడ దాకా మాతో పాటు రావాల్సిందేనంటూ TTE చెప్పాడు. Man steps … Read more

    మళ్లీ ట్రెండింగ్‌లో ‘డించక్‌ పూజ’

    [VIDEO](url): విచిత్రమైన పాటలతో పాపులర్‌ అయిన సోషల్‌ మీడియా స్టార్‌ ‘డించక్‌ పూజ’ మరోసారి ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించి.. డించక్‌ పూజ చేసిన ర్యాప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్వాగ్‌ వాలీ టోపీ, దారు వంటి పాటలతో డించక్‌ పూజ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. అయితే 2017లో యూట్యూబ్‌ ఆమె పాటలన్నింటినీ యూట్యూబ్‌ నుంచి తొలగించింది. అయినా విచిత్రమైన వీడియోలతో డించక్‌ పూజ అభిమానులను అలరిస్తూనే ఉంది. Bharat Jodo Yatra Rap ?#BharatJodoYatra#RahulGandhi#BharatJodoYatraRap#AnamAliPrayer#Congress@RahulGandhi … Read more

    నేపాల్‌ విమానం కుప్పకూలుతున్న వీడియో

    [VIDEO](url): 72 మంది ప్రాణాలను బలి తీసుకున్న నేపాల్‌ దుర్ఘటనలో విమానానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాడ్మండు నుంచి కాస్కీ జిల్లాలోని పోఖారాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి క్షణాల ముందు విమానం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. A video reportedly to be the final moments before the accident shows the aircraft banking … Read more

    మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న అట్లీ, ప్రియా

    సక్సెస్‌ఫుల్ దర్శకుడు అట్లీ తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. తన భార్య ప్రియ ప్రస్తుతం గర్భవతి. ‘ఈ నూతన ప్రయాణంలో మీ ఆశీస్సులు కావాలి’ అంటూ ఇటీవల తన సంతోషాన్ని పంచుకున్నాడు. స్నేహితుల ద్వారా ఏర్పడిన అట్లీ, ప్రియల పరిచయం 2014లో పరిణయానికి దారితీసింది. తేరీ, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాలను అట్లీ తెరకెక్కించాడు. ప్రస్తుతం భార్యతో పాటు కలిసి ఉంటూ… తండ్రి కాబోతున్న మధుర క్షణాలను అస్వాదిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. View this post on Instagram … Read more

    ఓలా రెస్ట్‌ రూమ్స్‌ వీడియో నిజమేనా?

    [VIDEO](url): Ola క్యాబ్‌ సంస్థకు సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఓలా రెస్ట్‌రూమ్స్‌’ పేరిట సంస్థ కొత్త సేవలు తీసుకురాబోతోందని ఆ వీడియో సారాంశం. ఇందులో ఓ వ్యక్తి నిలుచున్న చోటు నుంచే రెస్ట్‌రూం కోసం ఆర్డర్‌ చేయవచ్చు. మొబైల్‌ టాయ్‌లెట్‌ వెహికిల్‌ క్షణాల్లో వారిని చేరుతుంది. నిజానికి ఈ వీడియో నాలుగేళ్ల నాటిది. 2019 మార్చి 29న ఓలా ఈ వీడియోను షేర్ చేస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 1న అది నిజం కాదంటూ ఏప్రిల్‌ ఫూల్‌ అని … Read more