[VIDEO](url): 72 మంది ప్రాణాలను బలి తీసుకున్న నేపాల్ దుర్ఘటనలో విమానానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాడ్మండు నుంచి కాస్కీ జిల్లాలోని పోఖారాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి క్షణాల ముందు విమానం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.