• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది. వందే … Read more

    NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !

    తొమ్మిదేళ్ల కల.. వయసు 19 ఏళ్లు.. ఆశయానికి అనుగుణంగా కష్టపడిన ఆమెను విజయం వరించింది. రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది ఈ సుందరి. ఆమె గురించి మరిన్ని వివరాలు  తెలుసుకుందాం.  మిస్ ఇండియా 2023 మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్‌ కోటాకు చెందిన నందనీ గుప్తా గెలుపొందింది. మణిపూర్‌లో జరిగిన 59వ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 15న … Read more

    పాపులారిటీ కోసమే అతిక్ హత్య

    గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ మర్డర్ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాపులారిటీ కోసమే హత్య చేసినట్లు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. సాధారణ జర్నలిస్టుల్లా ముసుగు వేసుకుని నిందితులు హత్యకు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులు లవ్లేష్, సన్నీ, అరుణ్ మౌర్యలను పోలీసులు అరెస్టు చేశారు. హత్య ఘటనలో అతిక్‌తో పాటు అతడు సోదరుడు కూడా మృతిచెందడం గమనార్హం. #WATCH | Atiq … Read more

    క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు

    క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ కల్పిస్తోంది. త్వరలోనే దీనిని అమలులోకి తీసుకు రానున్న తొలి బ్యాంకుకా ఘనత సాధించనుంది. డిజిటల్ వ్యాలెట్‌తో కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. రూపే కార్డులకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఈ సేవలను పొందడానికి ముందుగా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి.. క్రెడిట్ కార్డు ఆప్షన్‌ని ఎంచుకున్న అనంతరం వివరాలు సమర్పించాలి. త్వరలో మిగతా … Read more

    అతిక్ హత్య వెనుక యూపీ ప్రభుత్వం: ఒవైసీ

    [VIDEO:](url) గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ హత్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ హత్యలో యూపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. దర్యాప్తుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దర్యాప్తు కమిటీలో ఒక్కరు కూడా ఉత్తర్ ప్రదేశ్ అధికారి ఉండకూడదని ఒవైసీ షరతు విధించారు. నిన్న రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో అతిక్‌తో … Read more

    వివాదంలో చిక్కుకున్న దలైలామా

    [VIDEO](url): బౌద్ధ మత గురువు దలైలామా వివాదంలో చిక్కుకున్నారు. తన నాలుకను తాకాలంటూ ఓ బాలుడితో కోరినట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో దలైలామా ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ఓ బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం తన నాలుకను బయటపెట్టి.. దీన్ని తాకుతావా అంటూ సైగ చేశారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆయన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. So … Read more

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇక నుంచి ఏటా రెండు సార్లు DA, DR అలవెన్స్‌లు బెసిక్ శాలరీకి యాడ్ కానున్నాయి. జనవరి- జులైలో రివైజ్ కానున్నట్లు సమాచారం. బేస్ ఇయర్‌ను 1963-65 నుంచి 2016 సంవత్సరానికి మార్చడం జరిగింది. అలాగే కొత్త వేతన సవరణ సూచికను కేంద్రం తీసుకురానుంది. 7వ వేతన సవణ ప్రకారం 4శాతం డీఏ, మరో 4శాతం డీఆర్‌ను పెంచనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఉద్యోగుల DAను … Read more

    ఖాకీ డ్రెస్‌లో అదిరిపోయిన మోదీ లుక్‌..!

    [VIDEO](url): దేశంలో పులుల లెక్కలను విడుదల చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో పర్యటిస్తున్నారు. ఖాకీ టీషర్ట్‌-ప్యాంటుతో పాటు తలపై టోపీతో ప్రధాని సఫారీ చేస్తున్నారు. ఇవాళ బందీపూర్‌లో తాను పర్యటించనున్నట్లు ప్రధాని నిన్న తెలిపారు. ఏప్రిల్ 9, తాను ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతాను’ అని ట్వీట్ చేశారు. ట్వీట్‌లో చెప్పినట్లుగానే ప్రధాని బంధీపూర్ టైగర్ రిజర్వును సందర్శిస్తున్నారు. ఓపెన్ టాప్ జీపులో పర్యటిస్తున్నారు. #WATCH | Prime Minister Narendra Modi arrives at … Read more

    కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం

    [వీడియో:](url) కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు పెను ప్రమాదం తప్పింది. జమ్ము కశ్మీర్‌లోని రంబన్ జిల్లా బనిహాల్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది కారు డోర్లు తెరచి మంత్రిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. కాగా మంత్రి కిరణ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. जम्मू कश्मीर के रामबन … Read more

    ఏప్రిల్ 8 నుంచి తగ్గనున్న గ్యాస్‌ ధరలు

    దేశంలో PNG, CNG గ్యాస్ ధరలు తగ్గాయి. ధరల నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం వీటి ధరలను 11 శాతం మేర తగ్గించింది. CNG గ్యాస్ కేజీ ధర ప్రస్తుతం రూ.92 ఉంటే అది దాదాపు రూ.83కు తగ్గింది. PNG గ్యాస్ కిలో రేటు రూ.57 నుంచి రూ.52కు తగ్గింది. ఈ ధరలు ONGC, OIL వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉత్పత్తి చేసిన సహజవాయువుకే వర్తించనున్నాయి. రిలయన్స్ కేజీ డీ6 వంటి ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసే సహజవాయువుకు వర్తించవు. దేశ … Read more