‘ఈ సినిమాలో రాశిఖన్నాను తీసుకోమని నేనే చెప్పా’
‘పక్కా కమర్షియల్’ మూవీలో హీరోయిన్ పాత్రకు రాశిఖన్నా అయితే బాగుంటుందని నేనే చెప్పానని నిర్మాత అల్లు అరవింద్ అన్నాడు. చెప్పినట్లుగానే ఆమె లాయర్ క్యారెక్టర్‌లో చాలా బాగా నటించిందని చెప్పాడు. నిన్న పక్కా కమర్షియల్ వేడుకలో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గోపిచంద్, రాశిఖన్నా కలిసి కనిపించే సీన్లలో చాలా బాగా నవ్వుకుంటారని వెల్లడించాడు. ఈ సినిమాను ఒక ప్రేక్షకుడిగా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మారుతీకి ప్రేక్షకులను ఎలా నవ్వించాలో బాగా తెలుసునని పేర్కొన్నాడు.