• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Malavika Mohanan: ఎవరు పాప నువ్వు?.. ఇంత ఓపెన్‌గా చూపిస్తున్నావు?

    యంగ్‌ బ్యూటీ మాళవిక మోహనన్‌.. తన హాట్‌ హాట్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. లోదుస్తుల్లో ఎద, నడుము అందాలను చూపిస్తూ సెగలు రేపుతోంది.  

    ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మాళవిక హాట్‌ పిక్స్‌ను విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు.

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్‌కు మాళవిక మోహన్  కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.

    ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

    అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది.

    ఈ క్రమంలోనే ధనుష్‌ పక్కన ‘మారన్‌’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

    2020లో ‘మసాబా మసాబా’ అని టెలివిజన్‌ సిరీస్‌లోనూ మాళవిక నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది. 

    అవార్డుల విషయానికి వస్తే 2019లో ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’ అనే బాలీవుడ్‌ చిత్రానికి గాను ‘యాక్టింగ్‌ సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును మాళవిక గెలుచుకుంది. 

    అలాగే 2022లో మాస్టర్‌ చిత్రానికి గాను బెస్ట్‌ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్‌ నామినేట్‌ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది. 

    ప్రస్తుతం ఈ భామ తెలుగుతోపాటు తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజా సాబ్’ మూవీలో మాళవిక హీరోయిన్‌గా చేస్తోంది.

    ‘రాజా సాబ్‌’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్‌ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు.

    తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ సరసన కూడా మాళవిక నటిస్తోంది. ‘తంగలాన్‌’ చిత్రంలో ఈ బ్యూటీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో ‘యుద్ర’ అనే సినిమాలోనూ ఆమెకు అవకాశం దక్కింది. 

    వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

    స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆమె నిత్యం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv