నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
విడుదల తేదీ: 10-05-2024
నారా రోహిత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2 Review). గతంలో విడుదలై ప్రతినిధి చిత్రానికి కొనసాగింపుగా ఇది రూపొందింది. ప్రముఖ పాత్రికేయుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. ఏపీ ఎన్నికల సమయంలో ఈ పొలిటికల్ డ్రామా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. మే 10న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్టు. ఫ్రీలాన్స్ రిపోర్టర్‌గా పని చేస్తూ నిజాలను ఎలాంటి భయం లేకుండా వెలుగులోకి తీసుకొస్తుంటాడు. దీంతో అతడ్ని NCC ఛానల్ ఏరికోరి సీఈవోగా నియమిస్తుంది. అప్పటి నుంచి చేతన్ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎం ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
జర్నలిస్టు చేతన్ పాత్రలో నారా రోహిత్ (Prathinidhi 2 review In Telugu) అదరగొట్టాడు. భావోద్వేగాలు చక్కగా కనబరిచాడు. పోరాట సన్నివేశాలపైనా ప్రభావం చూపాడు. ఫస్టాఫ్‌లో అతడి నటన హైలెట్‌గా ఉంటుంది. హీరోయిన్ సిరి లెల్లా పాత్ర పరిమితమే. సెకండాఫ్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సీఎంగా సచిన్ ఖేడ్కర్ తనదైన ముద్ర వేశారు. అటు దినేశ్ తేజ్, జిషుసేన్ గుప్తా. అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయభాను పాత్రలు మెప్పిస్తున్నాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మూర్తి (Prathinidhi 2 review In Telugu).. కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా మూవీని తెరకెక్కించారు. జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు. ఆరంభ సీన్స్‌లో హీరో నైజాన్ని, జర్నలిజం గొప్పతనాన్ని దర్శకుడు తెలియజేశాడు. తొలి సగభాగంలో కలం చేత పట్టిన హీరో.. ద్వితీయార్ధంలో కత్తి పడతాడు. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఓటు విలువను చాటి చెబుతూ దర్శకుడు తీర్చిదిద్దిన సన్నివేశాలు మెప్పిస్తాయి. ముఖ్యంగా పొలిటికల్ యాంగిల్‌లో వచ్చే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. అయితే రాజకీయ కోణంలో తీసిన కొన్ని సీన్లు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే హీరో కుటుంబ నేపథ్యం చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. సీబీఐను దర్శకుడు సాదాసీదాగా చూపించడం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి బలం. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టాల్సింది. ముఖ్యంగా సెకాండాఫ్‌లో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
ప్లస్ పాయింట్స్
- హీరో నటన
- కథలో ట్విస్టులు
- పొలిటికల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
- ఎడిటింగ్
- లాజిక్స్‌కు అందని సీన్లు
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’