• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New OTT Releases Telugu: ఓటీటీలో ఎన్ని సూపర్‌ హిట్‌ చిత్రాలు ఉన్నాయో తెలుసా? ఓ లుక్కేయండి!

    ప్రస్తుతం ఓటీటీ (New OTT Releases Telugu) అనేది సినిమాల సంద్రంగా మారిపోయింది. ప్రతీవారం వివిధ జానర్లకు సంబంధించిన కొత్త చిత్రాలు / సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి. థియేటర్లలో రిలీజై నెల రోజులు గడవకముందే ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తాయి. దీంతో రోజు రోజుకు ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి నాలుగు నెలల్లోనే స్ట్రీమింగ్‌లోకి అద్భుతమైన తెలుగు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం అవి వివిధ ఓటీటీ వేడుకల్లో అత్యధిక వీక్షణలతో సాగుతున్నాయి. ఆ చిత్రాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    Contents

    మంజుమ్మెల్ బాయ్స్‌ (Manjummel Boys)

    మలయాళం సెన్సేషన్‌ మంజుమ్మెల్‌ బాయ్స్‌.. రీసెంట్‌గా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మలయాళంతో తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మూవీ కథ ఏంటంటే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.

    ఆవేశం (Aavesham)

    పుష్ప ఫేమ్‌ ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) నటించిన లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఆవేశం’. మల్లువుడ్‌లో ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించింది. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే.. కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్‌ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్‌ గుండా రంగా (ఫహద్‌ ఫాసిల్‌)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? అన్నది కథ.

    గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)

    అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్‌, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన (New OTT Release Telugu Movies) హార్రర్‌ ఎంటర్‌టైనర్‌.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘. ఈ మూవీ మే 8 నుంచి ఆహా స్ట్రీమింగ్‌ అవుతోంది. స్టోరీ విషయానికి వస్తే.. డైరెక్టర్‌ శ్రీను (శ్రీనివాస రెడ్డి) కొత్త సినిమా కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సత్య, అంజలి హీరో హీరోయిన్లుగా సినిమా చేసే ఛాన్స్ వస్తుంది. అయితే నిర్మాత దెయ్యాల కోటగా పేరున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్‌ చేయాలని షరతు విధిస్తాడు. ఇంతకీ, ఆ సంగీత్ మహల్ గతం ఏమిటి? అక్కడ మూవీ టీమ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.

    ఫ్యామిలీ స్టార్‌ (Family Star)

    విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. థియేటర్‌లో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ.. ఏప్రిల్‌ 26 నుంచి అమెజాన్‌లో వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ‘గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఓ రోజు ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? కుటుంబ క‌ష్టాల నుంచి గోవర్ధన్‌ గట్టెక్కాడా లేదా?’ అన్నది కథ.

    చుండూరు పోలీస్ స్టేషన్ (Chunduru Police Station)

    ‘కోట బొమ్మాళి పీ.ఎస్‌’ చిత్రానికి (New OTT Release Telugu Movies) మాతృక అయిన మలయాళ మూవీ ‘నాయట్టు’ను తెలుగులో ‘చుంటూరు పోలీసు స్టేషన్‌’ పేరుతో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘ఓ సామాజిక వర్గానికి చెందిన యువ నేతతో ఏఎస్‌ఐ మణియన్‌, కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ గొడవ పడతారు. కానిస్టేబుల్‌ సునీతతో వారు కారులో వెళ్తుండగా వాహనాన్ని నడిపే డ్రైవర్‌ యువనేత బంధువును ఢీకొడతాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో గొడవ రాజకీయ రంగు పలుముకుంటుంది. తర్వాత ఏం జరిగింది? ఆ ముగ్గురు పోలీసులు ఎందుకు పరారయ్యారు? వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి?’ అన్నది కథ.

    భీమా (Bhimaa)

    గోపిచంద్‌ లేటెస్ట్‌ చిత్రం ‘భీమా.. ఇటీవల థియేటర్లలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్‌ 25న హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరుశురామ క్షేత్రం దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి?’ అన్నది ఈ సినిమా కథ.

    టిల్లు స్క్వేర్‌ (Tillu Square)

    డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. ప్రీక్వెల్‌ కంటే బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చేశారు. ఏప్రిల్‌ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.

    మై డియర్‌ దొంగ (My Dear Donga)

    హాస్య నటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన మై డియర్‌ దొంగ ఫిల్మ్‌ నేరుగా ఓటీటీలోకి విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఆహా వేదికగా ఏప్రిల్‌ 19నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. బి.ఎస్‌ సర్వజ్ఞ కుమార్‌ దర్శకుడు. ‘సుజాత, విశాల్‌ ప్రేమించుకుంటారు. అయితే విశాల్‌లో మార్పు వచ్చిందని ఆమె భావిస్తుంటుంది. ఈ క్రమంలోనే అమె ఇంట్లోకి సురేశ్‌ (అభినవ్‌ గోమఠం) దొంగతనం చేయడానికి ప్రవేశిస్తాడు. అదే సమయంలో విశాల్‌ & ఫ్రెండ్స్‌.. సుజాత బర్త్‌డే సెలబ్రేట్‌ చేయడానికి ఫ్లాట్‌కి వస్తారు. ఆ తర్వాత ఏమైంది? సురేశ్‌ను బాల్య స్నేహితుడిగా సుజాత ఎందుకు పరిచయం చేసింది? వారి కుటుంబ నేపథ్యాలేంటి?’ అన్నది కథ.

    సైరన్‌ (Siren)

    జయం రవి, కీర్తి సురేష్‌, అనుపమా పరమేశ్వరన్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘సైరన్‌‘ చిత్రం (New OTT Releases Telugu).. క్రైమ్ థ్రిల్లర్‌ను ఇష్టపడే వారిని విపరీతంగా ఆకర్షించింది. హాట్‌స్టార్‌లో ఈ మూవీని వీక్షించవచ్చు. కథ ఏంటంటే.. భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.

    యాత్ర 2 (Yatra 2)

    ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో జగన్‌ పాత్రలో నటుడు జీవా కనిపించాడు. వైఎస్సార్‌ పాత్రను మమ్మూటీ పోషించారు. గతంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. ‘వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి రావటానికి గల కారణమేంటి? ఓదార్పు యాత్రకు నాటి నాయకులు సృష్టించిన అడ్డంకులు ఏంటి? వాటిని జగన్‌ ఎలా అధిగమించారు? అన్నది కథ.

    కాటేరా (Kaatera)

    గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం కన్నడలో ‘సలార్‌‘ చిత్రానికి గట్టి పోటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 14 నుంచి జీ 5 వేదికగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇందులో కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా చేశాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.

    గామి (Gaami)

    యంగ్‌ హీరో విష్వక్‌ సేన్ రీసెంట్‌ చిత్రం గామి (New Releases On OTT Today Telugu).. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఏప్రిల్‌ 12 నుంచి జీ 5 వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ.

    ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)

    శ్రీవిష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. శ్రీవిష్ణు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఫిల్మ్‌ ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

    లాల్‌ సలామ్‌ (Lal Salaam)

    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అతిథి పాత్రలో చేసిన ‘లాల్‌ సలామ్‌‘ థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే సన్‌ నెక్స్ట్‌ వేదికగా ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ సంపాదించింది. ‘హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులుగా ఉంటారు. కొంత కాలం ఒకే జట్టుకు ఆడినప్పటికీ.. వారిలో ఒకరు కొత్త టీమ్‌ను స్థాపిస్తారు. దీంతో రెండు జట్లు రెండు మతాలకు ప్రాతినిథ్యం వహించడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ ఆ ఇద్దరు క్రికెటర్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. అప్పుడు ముస్లిం క్రికెటర్‌ తండ్రి (రజనీ) ఏం చేశాడు?’ అన్నది కథ.

    కాజల్‌ కార్తిక (Kajal Karthika)

    ప్రముఖ నటి కాజల్‌ నటించిన రీసెంట్ హార్రర్‌ చిత్రం ‘కాజల్‌ కార్తిక’. ఇందులో రెజీనా మరో ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆహాలో ఈ మూవీ అందుబాటులో ఉంది. కథ విషయానిసి వస్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్లి అక్కడ వందేళ్ల నాటి పుస్తకాన్ని చదువుతుంది. అందులోని ఐదు దయ్యాల పాత్రలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన కార్తిక (కాజల్‌) ఎవరు? ఆమె మరణానికి గ్రామస్తులు ఎందుకు కారణమయ్యారు? మిగిలిన నాలుగు దెయ్యాల పాత్రలు ఏంటి? అన్నది కథ.

    చారి 111 (Chari 111)

    హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ డిటెక్టివ్‌గా చేసిన ఈ చిత్రం.. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ‘చారి (వెన్నెల కిషోర్) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఏజెంట్. సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ చేత చివాట్లు తింటుంటాడు. ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ కేసును సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. అతడు ఈ కేసును ఎలా ఛేదించాడు? క్రైమ్‌ వెకనున్న వ్యక్తి ఎవరు?’ అన్నది కథ.

    తంత్ర (Tantra)

    యంగ్ హీరోయిన్‌ అనన్య నాగళ్ల లీడ్‌లో నటించిన ‘తంత్ర’ (New Releases On OTT Today Telugu) చిత్రాన్ని ఆహాలో వీక్షించవచ్చు. కథ ఏంటంటే.. రేఖ (అనన్య)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. బాల్య స్నేహితుడు తేజూను ఆమె ఇష్టపడటంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? విగత (వంశీ), రాజేశ్వరి (సలోని) పాత్రలతో రేఖకు సంబంధం ఏంటి? అన్నది ప్లాట్‌.

    అదృశ్యం (Adrishyam)

    క్రైమ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మెుదట తమిళంలో విడుదలైంది. మంచి ఆదరణ పొందటంతో తెలుగులో డబ్‌ చేసి ఓటీటీలో విడుదల చేశారు. ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది. జానకి (అపర్ణ బాలమురళి) పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడ్ని హత్య చేసినట్లు సీఐ కరుణన్‌తో చెప్తుంది. పాతిపెట్టిన స్థలాన్ని కూడా చూపిస్తుంది. అయితే మీడియాతో ఈ హత్య చేసింది సీఐ కురణన్‌ అని జానకి చెప్పడంతో అంతా షాకవుతారు. పైగా పాతిపెట్టిన చోట రెండు శవాలు దొరకడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ బాడీలు ఎవరివి? జానకి లవర్‌ అశ్విన్‌ ఏమయ్యాడు? అన్నది కథ.

    మస్త్‌ షేడ్స్ ఉన్నయ్‌రా (Masthu Shades Unnai Ra)

    అభినవ్‌ గోమఠం, వైశాలి రాజ్ జంటగా చేసిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ, ఓటీటీ మాత్రం ఈ సినిమా మంచి వ్యూస్‌ను సాధించడం విశేషం. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాను చూడవచ్చు. మనోహర్ (అభినవ్‌ గోమఠం) సాధారణ పెయింటర్. ఓ కారణం చేత ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. చేతిలో రూపాయి లేని మనోహర్‌ ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి ఎలా విజయం సాధించాడు? అన్నది కథ.

    సుందరం మాస్టర్ (Sundaram Mastar)

    హాస్య నటుడు హర్ష చెముడు.. తొలిసారిగా చేసిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’. ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ సంపాదించింది. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కథ ఏంటంటే.. ‘సుందరం మాస్టర్‌ గవర్నమెంట్‌ టీచర్‌. ఇంగ్లీష్‌ నేర్పడం కోసం ఓ మిస్టరీ గ్రామానికి వెళ్తాడు. అక్కడి పరిస్థితులు సుందరంను ఆశ్చర్య పరుస్తాయి. ఆ గ్రామస్తులు ఎలా ఉన్నారు? సుందరంకు ఎమ్మెల్యే అప్పగించిన రహస్య పని ఏంటి? దాన్ని నెరవేర్చాడా లేదా?’ అన్నది కథ.

    కథ వెనుక కథ (Katha Venuka Katha)

    విశ్వంత్‌ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘కథ వెనుక కథ’. మార్చి 28న ఈ సినిమాను ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మూవీ ప్లాట్ ఏంటంటే.. ‘సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. తాను తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి?’ అనేది మిగతా కథ

    ఏం చేస్తున్నావ్? (Em Chesthunnav)

    విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పఠాన్‌ జంటగా (New Releases On OTT Today Telugu) చేసిన ఈ చిత్రానికి భరత్‌ మిత్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మార్చి 28న ఈటీవీ విన్‌ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘సాయి.. బి.టెక్ కంప్లీట్ చేసి ఖాళీగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో అతడికి నక్షత్ర పరిచయమై ప్రేమలో పడతాడు. కొన్ని కారణాలతో ఆమె బ్రేకప్‌ చెబుతుంది. రెండేళ్ల తర్వాత అతడి లైఫ్‌లోకి శ్రేష్ఠ వస్తుంది. ఆమె అతడి లైఫ్‌లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ‘ఏం చేస్తున్నావ్‌?’ అన్న ప్రశ్నలకు సాయి ఎలాంటి సమాధానం చెప్పాడు? అన్నది కథ.

    ట్రూ లవర్‌ (True Lover)

    ‘జై భీమ్‌’ నటుడు కె. మణికందన్‌ హీరోగా చేసిన ఈ చిత్రంలో గౌరి ప్రియ హీరోయిన్‌గా చేసింది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం.. హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అరుణ్, దివ్య కాలేజీ రోజుల నుంచి లవర్స్‌. దివ్య ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తుండగా.. అరుణ్‌ ఒక కాఫీ షాపు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు మెుదలవుతాయి. ఆ తర్వాత ఏమైంది? అరుణ్‌ – దివ్య కలిశారా? లేదా?’ అన్నది కథ.

    ఓపెన్‌హైమర్ 


    ఆస్కార్‌ వేడుకల్లో అవార్డుల పంట పండించిన ఈ చిత్రాన్ని ఓటీటీ వేదిక ‘జియో సినిమా’ ఇటీవల తెలుగులో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ప్రముఖ అమెరికన్‌ సైంటిస్ట్ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా – నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి?’ అన్నది స్టోరీ.

    ఆపరేషన్ వాలెంటైన్

    వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్‌ చిత్రం ఆపరేషన్‌ వాలంటైన్‌.. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా థియేటర్‌లో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అమెజాన్‌ ప్రైమ్‌లో మాత్రం మంచి వ్యూస్‌తో సాగుతోంది. కథ ఏంటంటే.. రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) భారత వైమానిక దళంలో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్‌తో ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? అన్నది స్టోరీ

    భూతద్దం భాస్కర్ నారాయణ (2024)

    రీసెంట్‌గా తెలుగు వచ్చిన క్రైమ్ ఇన్‌వెస్టిగేటివ్‌ థ్లిల్లర్స్‌లో ఈ మూవీ ఒకటి. నటుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అయ్యాడు. ఆహాలో ఈ మూవీని వీక్షించవచ్చు. ‘ఆంధ్ర – కర్ణాటక సరిహద్దుల్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. సైకో కిల్లర్‌ మహిళల్ని హత్య చేసి వారి తలల స్థాలంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. సవాలుగా మారిన ఈ కేసును సాల్వ్‌ చేయడం కోసం డిటెక్టివ్ భాస్కర్‌ నారాయణ రంగంలోకి దిగుతాడు. అతడు హంతకుడ్ని ఎలా పట్టుకున్నాడు?’ అన్నది కథ.

    అబ్రహం ఓజ్లర్ (Abraham Ozler)

    ప్రముఖ తమిళ నటుడు జయరామ్‌ లీడ్‌ రోల్‌ చేసిన అబ్రహం ఓజ్లర్.. క్రైమ్ థ్రిల్లర్‌ స్టోరీలను ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ‘ఓ సీరియల్‌ సర్జికల్‌ బ్లేడ్‌తో వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ముగ్గుర్ని ఒకే విధమైన పద్ధతిలో చంపుతాడు. దీంతో ఏసీపీ అబ్రహం ఓజ్లర్ రంగంలోకి దిగుతాడు. నాలుగో హత్య జరగకుండా ఏసీపీ ఆపగలిగాడా? చనిపోయిన ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అలెగ్జాండర్‌ (మమ్ముట్టి) పాత్ర ఏంటి?’ అన్నది స్టోరీ.

    హనుమాన్ (HanuMan)

    ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం (New Releases On OTT Today Telugu) జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించగా తేజ సజ్జ ఇందులో హీరోగా చేశాడు. ఓటీటీ వేదిక ‘జీ 5’లో ఈ మూవీ స్ట్రీమింగ్‌లో ఉంది. ప్లాట్‌ ఏంటంటే.. సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.

    తుండు (Thundu)

    మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. ‘ఉద్యోగంలో పదోన్నతి పొందాలనే కాంక్షతో ఉన్న కానిస్టేబుల్‌ చాలా నిజాయతీగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. దీంతో సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆ తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది?’ అన్నది స్టోరీ.

    భ్రమయుగం (Brahmayugam)

    మలయాళ స్టార్‌ హీరో మమ్మూట్టి.. ఇందులు తన నట విశ్వరూపం చూపించారు. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సోనీ లివ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది కథ.

    మిక్స్ అప్ (Mix Up)

    ఈ సినిమా (New Telugu Movie 2024 OTT) డిఫరెంట్‌ ఆడల్ట్‌ కంటెంట్‌తో ఓటీటీలోకి వచ్చింది. ఆహాలో మీరు వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే.. ‘రెండు జంటలకు సెక్స్, లవ్‌ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్‌ సూచన మేరకు వారు గోవా టూర్‌ ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలో గోవాలో జరిగిన సంఘటనలు ఏంటి? చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.

    అన్వేషి (Anveshi) 

    విజయ్‌ ధరన్‌, అనన్య నాగళ్ల,  సిమ్రాన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘మారేడుకోనలో ఊహించని విధంగా చనిపోతుంటారు. అను అనే అమ్మాయి కోసం వెతుక్కొంటూ విక్రమ్ ఆ గ్రామానికి వెళ్తాడు. అను మరణించిందనే విషయాన్ని తెలుసుకొంటాడు. ఇంతకు అను ఎవరు?ఎలా మరణించింది? గ్రామానికి అను ఎందుకు వచ్చింది?’ అన్నది సినిమా కథ.

    సువర్ణ సుందరి (Suvarna Sundari)

    300 ఏళ్ల చరిత్ర కలిగిన సువర్ణ సుందరి విగ్రహంలో దుష్టశక్తి ఉంటుంది. స్వాతంత్రం అనంతరం ఆ విగ్రహం ఓ బంగ్లాకు చేరుతుంది. ఆ భవంతిలో దిగిన కలెక్టర్ భార్య అంజలి.. విగ్రహాన్ని తాకడంతో ఆ దుష్టశక్తి ఆమెలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విగ్రహం వెనకున్న రహస్యం ఏంటి? అన్నది కథ.

    అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum)

    మలయాళంలో సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. తెలుగులో నెట్‌ఫ్లిక్‌ వేదికగా అందుబాటులో ఉంది. కథ ఏంటంటే.. ‘ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు?’ అన్నది స్టోరీ.

    మెర్రీ క్రిస్మస్ (Merry Christmas)

    విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం (New Telugu Movie 2024 OTT) .. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ మూవీ కథ వియానిసి వస్తే.. ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ.

    ఊరు పేరు భైరవకోన (2024)

    ప్రేయసి కోసం ఒక పెళ్లిలో నగలు దొంగతనం చేసిన బసవ (సందీప్ కిషన్).. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన గ్యాంగ్‌తో భైరవకోనకు పారిపోతాడు. అయితే ఆ ఊరికి వెళ్లినవారు ఎవరూ ప్రాణాలతో బయటకు వచ్చింది లేదు. మరి అక్కడ బసవకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరి మిస్టరీ ఏంటి? అన్నది కథ.

    12 ఫెయిల్‌ (12th Fail)

    బాలీవుడ్‌లో సన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం హాట్‌స్టార్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది. మనోజ్‌ కుమార్‌ అనే ఐపీఎస్‌ అధికారి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

    అంబాజీపేట మ్యారేజీ బ్యాండు (Ambajipeta Marriage Band)

    టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ వరుస హిట్లతో దూసుకుళ్తున్నాడు. ఇటీవల అతడు చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆహాలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ‘మ‌ల్లి (సుహాస్‌) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సభ్యుడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) స్కూల్‌ టీచ‌ర్‌. ఓ కారణం చేత ఊరి మోతుబరి వెంక‌ట్‌బాబు – మల్లికీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అది పెద్దదై ఊర్లో గొడవలకు దారి తీస్తాయి. ఆ త‌ర్వాత ఏం జరిగింది? ల‌క్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి?’ అన్నది కథ.

    ఈగల్‌ (Eagle)

    రవితేజ, అనుపమా పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని (New Telugu Movie 2024 OTT)  కార్తిక్‌ ఘట్టమనేని తెరక్కించారు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సహదేవ్ వర్మ (రవితేజ)ను స్థానికులు దైవంగా భావిస్తుంటారు. ఓ రోజు అతడు మిస్‌ అవుతాడు. సహదేవ్‌పై ఓ జర్నలిస్టు (అనుపమా) కథనం రాయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అతడి కోసం ఏకంగా సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఇంతకి సహదేవ్‌ గతం ఏంటి? అతడు ఏం చేేసేవాడు? చివరికి ఏమైంది? అన్నది కథ.

    బూట్‌ కట్‌ బాలరాజు (Bootcut Balaraju)

    ఊరిలో పనిపాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు (బూట్‌కట్‌ బాలరాజు) ఊరి పెద్ద (ఇంద్రజ) కూతుర్ని ప్రేమిస్తాడు. అదే సమయంలో మరో యువతి కూడా అతడ్ని ప్రేమిస్తుంది. కొన్ని పరిణామాల నేపథ్యంలో హీరో సర్పంచ్‌ అభ్యర్థిగా ఊరిపెద్దపై పోటీకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో ప్రేమకథ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది కథ.

    ఆంటోని (Antony)

    మలయాళం యాక్షన్‌ డ్రామాలను ఇష్టపడే వారికి ఆంటోని చిత్రం తప్పక నచ్చుతుంది. ఈ ఫిల్మ్‌ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జోజు జార్జ్‌ హీరోగా చేశాడు. ‘ఆంటోని.. జేవియర్‌ అనే రౌడీని చంపడంతో అతడి కూతురు మరియా అనాథగా మారుతుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్లేయర్‌ అయిన మరియాను ఇంటికి తీసుకొచ్చి సొంత కూతురిలా ఆంటోని చూసుకుంటాడు. మరోవైపు ఆంటోనీపై పగ తీర్చుకునేందుకు జేవియర్‌ తమ్ముడు పన్నాగాలు చేస్తుంటాడు. చివరికీ ఏమైంది?’ అన్నది కథ.

    అయాలన్‌ (Ayalaan)

    తమిళంలో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం.. ప్రస్తుతం తెలుగు భాషలో సన్‌ నెక్స్ట్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి?’ అన్నది కథ.

    నా సామి రంగ ( Naa saami Ranga)

    ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నాగార్జున చిత్రం ‘నా సామి రంగ’ (New Telugu Movie 2024 OTT) . ఇందులో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌. హాట్‌స్టార్‌లో ఈ ఫిల్మ్‌ స్ట్రీమింగ్‌లో ఉంది. మూవీ ప్లాట్‌ ఏంటంటే.. ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.

    ది కేరళ స్టోరీ (The Kerala Story)

    విడుదలకు ముందే జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఇందులో ఆదాశర్మ లీడ్‌ రోల్‌లో చేసింది. జీ 5లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌లో ఉంది. ‘కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్‌ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్‌ వాష్‌ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది?’ అన్నది కథ.

    కెప్టెన్‌ మిల్లర్‌ (Captain Miller)

    తమిళ స్టార్‌ ధనుష్‌ హీరోగా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగులో ఉంది. ఈ మూవీ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ‘ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి?’ అన్నది కథ.

    గుంటూరు కారం (Guntur Kaaram)

    మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో సంక్రాంతి కానుగా వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లో ఉంది. ‘రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల అతని తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లికి దూరంగా 25 ఏళ్లు పెరిగిన తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతాయి. మరి రమణ తన తల్లిని కలిశాడా? లేదా? అసలు వసుంధర తన కొడుకును ఎందుకు దూరం పెట్టింది? ఇద్దరి మధ్య దూరానికి కారణం ఎవరు?’ అన్నది మిగతా కథ.

    జోరుగా హుషారుగా (Joruga Husharuga)

    బేబీ మూవీ ఫేమ్‌ విరాజ్‌ హీరోగా చేసిన ఈ చిత్రానికి మహేష్‌ చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘సంతోష్ (విరాజ్) ఆనంద్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. ప్రేయసి నిత్య (పూజిత) సంతోష్‌కు చెప్పకుండా ఆ ఆఫీసులోనే చేరుతుంది. దీంతో ఆనంద్‌ ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు చేనేత కార్మికుడైన సంతోష్‌ తండ్రి తన రూ.20 లక్షల అప్పు తీరుస్తాడని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి సంతోష్ తండ్రి అప్పు తీర్చాడా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఏమైంది?’ అన్నది కథ.

    సైంధవ్‌ (Saindhav)

    ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వెంకటేష్‌ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేటర్‌లో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం సాలీడ్‌ రెస్పాన్స్‌ను అందుకుంది. ‘సైంధవ్‌ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్‌ నడుస్తుంటుంది. సైంధవ్‌ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి?’ అన్నది మిగతా కథ.

    పిండం (Pindam)

    ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన తెలుగు హర్రర్‌ చిత్రాల్లో ‘పిండం’ ఒకటి. శ్రీకాంత్‌ లీడ్‌ రోల్‌లో చేశాడు. ‘ఆంటోనీ తన కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? ఆ విషయాన్ని కనిపెట్టాలని లోక్‌నాథ్‌కు అన్నమ్మ సూచిస్తుంది. మరి లోక్‌నాథ్‌ ఏం చేశాడు? అన్నది కథ. 

    యానిమల్‌ (Animal)

    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘యానిమల్‌’ (New Telugu Movie 2024 OTT) . ఈ మూవీ జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. ‘దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు?’ అన్నది కథ.

    నెరు (Neru)

    మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ లాయర్‌గా చేసిన ఈ చిత్రం.. మల్లువూడ్‌లో ఘన విజయం సాధించింది. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది. ‘కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు?’ అన్నది కథ.

    సప్త సాగరాలు దాటి సైడ్‌-B (Sapta Sagaralu Dhaati Side – B)

    కన్నడ స్టార్‌ రక్షిత్‌ శెట్టి హీరోగా తెరకెక్కిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘సప్త సాగరాలు దాటి  సైడ్‌ – బి’.. తెలుగులోనూ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.

    ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (Aquaman and the Lost Kingdom)

    గతంలో వచ్చిన అక్వామెన్‌ చిత్రంలో హాలీవుడ్‌లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌’ కూడా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాను తెలుగులో వీక్షించవచ్చు.  ‘ఆర్థర్‌ కర్రీ (జాసన్‌ మోమోయ్‌).. సోదరుడు ఓరమ్‌ను ఓడించి ట్రైడెంట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అట్లాంటిస్‌ రాజు అవుతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సముద్రపు దొంగ డేవిడ్‌ బయలుదేరుతాడు. ఓ గుహలోకి వెళ్లిన అతడికి అద్భుతమైన శక్తులు ఉన్న బ్లాక్‌ ట్రైడెంట్‌ దొరుకుతుంది. దాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత డేవిడ్‌ ఎలా మారాడు? అతడికి లభించిన శక్తులు ఏమిటి? డేవిడ్ దుశ్చర్యలను ఆర్థర్‌ ఎలా ఎదుర్కొన్నాడు?’ అన్నది కథ.

    సలార్‌ (Salaar)

    ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (New Telugu Movie 2024 OTT)  దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘సలార్‌’. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌. క్రిస్మస్‌ కానుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ‘ఖాన్సార్‌ సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్‌ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఖాన్సార్‌కు రూలర్‌ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌) సాయం కోరతాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు?’ అన్నది స్టోరీ.

    అథర్వ (Atharva)

    కార్తిక్ రాజు హీరోగా.. మహేష్‌ రెడ్డి డైరెక్షన్‌ వచ్చిన ఈ చిత్రం.. క్రైమ్‌ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. ఓ హత్య కేసును క్లూస్‌ టీమ్‌ సాయంతో ఛేదించేందుకు హీరో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దర్యాప్తు కూడా మరింత సంక్లిష్టంగా మారుతుంది. చివరికీ ఆ కేసును ఎలా ఛేదించారు? అన్నది కథ.

    #మాయలో (#Mayalo)

    నరేష్‌ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి లీడ్‌ రోల్‌లో చేసిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.. ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘మాయ, క్రిష్‌, సింధు చిన్ననాటి స్నేహితులు. మాయకు తన ప్రియుడితో పెళ్లి ఫిక్స్‌ కావడంతో క్రిష్‌, సింధులను అహానిస్తుంది. ఓ కారు అద్దెకు తీసుకొని క్రిష్‌, సింధు రోడ్డుమార్గంలో బయలుదేరుతారు. వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? ఈ ముగ్గురి స్నేహ బంధం ఎలాంటింది?’ అన్నది కథ.

    డెవిల్‌ (Devil)

    కళ్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా.. థియేటర్‌లో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని ఓ జమీందారు కూతురు హత్య జరుగుతుంది. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి?’ అన్నది స్టోరీ.

    కోట బొమ్మాళి పీఎస్‌ (Kotabommali PS)

    సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించి అలరించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌‘. ఈ మూవీ నటుడు శ్రీకాంత్‌కు చాలా కాలం తర్వాత ఒక సాలిడ్‌ హిట్‌ను అందించింది. మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ వచ్చింది. ‘కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది’ కథ.

    హాయ్‌ నాన్న (Hi Nanna)

    హీరో నాని జెర్సీ తర్వాత తండ్రిగా నటించిన మరో చిత్రం ‘హాయ్‌ నాన్న’. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్లాట్‌ ఏంటంటే.. విరాజ్ (నాని) ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మహి. ఆ తర్వాత ఏం జరిగింది. మహి, యష్న (మృణాల్‌ ఠాకూర్‌) ఎలా ఫ్రెండ్స్‌ అయ్యారు. విరాజ్‌చెప్పిన అమ్మ కథలో వర్ష పాత్ర ఎవరిది? అన్నది కథ.

    కాలింగ్‌ సహస్ర (Calling Sahasra)

    జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. ఈ మూవీ థియేటర్లలో కంటే ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. అమెజాన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మూవీ ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘సహస్ర అనే అమ్మాయి వాడిన ఫోన్ నంబర్‌ను అజయ్ (సుధీర్) కొనుగోలు చేస్తాడు. అయితే సహస్ర కోసం ఆమె స్నేహితులు, బంధువులు అజయ్ ఫోన్‌కు కాల్ చేస్తుంటారు. ఇంతకీ సహస్ర ఏమైంది? అమ్మాయిలను వరుసగా చంపుతున్న కిల్లర్‌ ఎవరు? అతడ్ని హీరో ఎందుకు పట్టుకోవాలని అనుకుంటాడు?’ అన్నది కథ.

    రారా పెనిమిటి (Raa Raa Penimiti)

    ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన ప్రయోగాత్మక తెలుగు చిత్రం ‘రారా పెనిమిటి’. హీరోయిన్‌ నందిత శ్వేత.. ఏకైక నటిగా ఇందులో చేసింది. ఆమె తప్ప సినిమాలో సినిమాలో ఏ పాత్ర కనిపించదు. ‘ఓ అందమైన భార్య.. తన భర్త కోసం అతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ‘రా రా పెనిమిటి’ అంటూ ప్రేమగా పిలుచుకుంటూ అతని కోసం అన్నిరకాలుగా ఎదురు చూస్తుంది. ప్రతిరోజు ఆమెకు నిరాశే ఏర్పడుతుంది. ఇంతకు ఆమె భర్త ఎటు వెళ్లాడు? అన్నది కథ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv